ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి నూతన పబ్లిక్
ప్రశ్నాపత్రం నమూనా
➤పది పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు
➤ఒక్కో పేపరు 50 మార్కులు.. బిట్ పేపర్
తొలగింపు
➤గతేడాది
వరకు ఉన్న అంతర్గత మార్కులు 20% తొలగింపు.
➤హిందీ/సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి
పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 10 నిమిషాలు
ప్రశ్నపత్రం చదువుకునేందుకు మరో ఐదు నిమిషాలు చివరిలో జవాబులు సరి చూసుకునేందుకు
ఇవ్వనున్నారు.
➤హిందీ/సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున
పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం
చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు.
➤ రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు
వస్తే ఉత్తీర్ణత. సబ్జెక్టు వారీగానే చూస్తారు తప్ప ప్రశ్నపత్రం వారీగా ఉండదు.
➤బిట్ పేపర్ ప్రత్యేకంగా ఉండదు. ప్రశ్నపత్రంలోనే ఐదు రకాల
సూక్ష్మ లఘు ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపర్చడం,
ఒక పదంలో సమాధానం, ఏది సరైనది- ఏది కాదు,
కార్యకారణ సంబంధ ప్రశ్నలు ఉంటాయి.
➤ 18 పేజీల సమాధాన బుక్లెట్ ఇవ్వనున్నారు.
మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇందులోనే రాయాల్సి ఉంటుంది.
➤ ఒక మార్కు ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబివ్వాలి. రెండు
మార్కుల ప్రశ్నలకు రెండు, మూడు లైన్లలో సమాధానం ఇవ్వాలి. వ్యాసరూప
ప్రశ్నలకు 8-10 వాక్యాలు రాయాల్సి ఉంటుంది.
➤విద్యార్థులు
బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ప్రశ్నలు ఇస్తారు.
Composite course Telugu question paper for Summetive Assessment 1
ReplyDelete