Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP New Governor Biswa Bhushan Harichandan

AP New Governor Biswa Bhushan Harichandan
బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారి బయోడేటా

పుట్టిన తేదీ : 03-08-1934 (85 ఏళ్లు)
తండ్రి పేరు : పరశురాం హరిచందన్‌
భార్య పేరు : సుప్రవ హరిచందన్‌
చదివినది : బీఏ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌బీ
వృత్తి : న్యాయవాది
ఆసక్తి : ప్రజల భాగస్వామ్యంతో అవినీతి, అన్యాయాలపై ఉద్యమాలు, సామాజిక, రాజ్యాంగ హక్కులపై పౌరులకు అవగాహన కల్గించడం
ప్రత్యేకతలు: ప్రముఖ న్యాయవాది, రచయిత, భాజపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం, ఒడిశా మంత్రిగా సేవలు
జనసంఘ్‌తో విశ్వభూషణ్‌ రాజకీయ ప్రస్థానం
భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్‌ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్‌ జనతా పార్టీలో చేరి తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. ఆయనకు కవిత్వమంటే మక్కువ. మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝలక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో రచించారు. ఒక నాటికనూ రచించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఆయనకెంతో ఇష్టం. న్యాయ విద్యలో పట్టభద్రుడైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి ఒక్కోసారి, బీజేపీ నుంచి మూడుసార్లు ఒడిశా శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. భువనేశ్వర్‌ నుంచి మూడుసార్లు, సిలికా నుంచి రెండుసార్లు ఎన్నికైన ఆయన భాజపా-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు (రెండు పర్యాయాలు) పరిశ్రమలురెవెన్యూన్యాయశాఖల మంత్రిగా సేవలందించారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags