Employee Voluntary retirement
వాలంటరీ
రిటైర్మెంట్ (స్వచ్చంద పదవీ విరమణ)
* వాలంటరీ
రిటైర్మెంట్ కొరకు 20 సం. అర్హత గల సర్వీసు పూర్తి చేసినవారు 3 నెలల ముందుగా
తానున్న పోస్టుకు నియామకము చేయు అధికారికి నోటీసు ఇవ్వాలి.
* వాలంటరీ
రిటైర్మెంట్ అనుమతికై ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్టు, డ్యూటీ చేయుటకు
అర్హత కలిగినట్లు ఇద్దరు వైద్యులచే (Civil Surgeons) సర్టిఫికెట్
సమర్పించాలి.
* అనారోగ్యం, ఉన్నత
విద్యాభ్యాసమునకు పెట్టిన జీతనష్టపు సెలవు తప్ప, మరే ఇతర
జీతనష్టపు సెలవు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.
* అధికారి ఐచ్చిక
రిటైర్మెంట్ కు అనుమతి ఇచ్చిన తర్వాత పదవీ విరమణ చేయాలి.
* గ్రాట్యూటీ
మాత్రము 20 సం. వచ్చేదే ఇస్తారు. కుటుంబ పెన్షస్,కమ్యూటేషస్
సౌకర్యాలు ఉంటాయి.
A.P.R.P Rule 1980
Rule 43(5) (G.O.Ms.No.413 F&P Dt:29-11-1977)
* వాలంటరీ
రిటైర్మెంట్ పొందువారికి (ఇతర కారణాలపై) కారుణ్య నియామక సౌకర్యం వర్తించదు.
* వాలంటరీ
రిటైర్మెంట్ కు ప్రత్యేక వైద్య పరీక్షలు అవసరం లేదు. ( పైన తెలిపిన సర్టిఫికెట్స్
చాలు ).
* 20 సం. సర్వీసు కలిగి
యుండి వాలంటరీ రిటైర్మెంట్ చేయు ఉద్యోగి ఇంకను 5 సం. మించి సర్వీసు ఉంటే 5 సం. వెయిటేజి
కలుపుతారు. 5 సం. లోపు సర్వీసు ఉంటే అంతకాలం మాత్రమే సర్వీసు వెయిటేజి కలుపుతారు.
దాని ఆధరాంగానే పెన్షన్ లెక్కిస్తారు.Click here for above information in PDF
0 Komentar