Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MEI Society Moral Story telling Competition

MEI Society Moral Story-Telling Competition on 14th of August 2019

మిషన్ ఎథికల్ ఇండియా సొసైటీ (MEIS) ఆధ్యర్యం లో పాఠశాల విద్యార్ధులకు 14 ఆగష్టు 2019న నీతి కథల వకృత్వ పోటీలు
పాఠశాలల రిజిస్ట్రేషన్లకై (ఉచితం) ఉపాధ్యాయులకు పిలుపు
*MEIS ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా, సమాజంలో నైతిక ప్రవర్తనను ప్రోత్సహించడం, తద్వారా మన పిల్లలకు మరింత ప్రశాంతమైన సమాజాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.
*నైతిక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించటం కోసం MEIS రెండు మార్గాలను ఎంచుకున్నది.
1. నీతి కథల వక్తృత్వ పోటీల నిర్వహణ - పాఠశాల విద్యార్థులకు- ప్రతి సంవత్సరం ఆగష్టు 14న కథల ద్వారా పిల్లలకు నుంచి, చెడు విచక్షణ మొదలగు విషయాలు అలవడతాయి.
2. వాల్ ఆఫ్ ఎథిక్స్ - పది నీతి సూక్తులను, ఒక పోష్టర్ గా పంపిణీ చేయటం. 
*2013 లో తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా ఖిలాషాపురం గ్రామంలో మొదలైన ఈ కార్యక్రమం కొన్ని రాష్ట్రాలకు చేరింది. 2018 విద్యా సంవత్సరంలో, ఐదు రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలు (గుజరాత్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ మరియు కర్ణాటక) , ఆ రాష్ట్రాలలోని అన్ని పాఠశాలల్లో 14 ఆగష్టు న నీతి కధల పోటీలు నిర్వహించమని సర్కులర్ జారీ చేశాయి.
*విద్యార్ధిలోని శక్తి సామర్ధ్యాలను గుర్తించి, వారి పురోగతికి మార్గదర్శాకాన్ని అందిస్తూ, వారిలో నైతిక విలువలతో కూడిన ఆలోచనలు కల్పించడం ద్వారా ఆహ్లాదకరమైన జీవితానికి పునాది వేస్తారు ఉపాధ్యాయులు.
*మీ వద్ద విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులను, విద్యలో ప్రతిభావంతుల్ని చేయడమే కాకుండా, నైతిక విలువల రాయబారులుగా నిలిపేందుకు, తద్వారా, "నైతికత జీవన విధానంగా" సాగిపోయే సామాజినికి పునాదులు వేసే దిశగా, మీ పాఠశాలను https://www.ethicalindia.org/ లో ఆగష్టు 1 వ తేదీ లోగా, రిజిస్టర్ చేసుకోమని అభ్యర్థిస్తున్నాము.
*రిజిస్టర్ చేసుకున్న ప్రతి పాఠశాలలోని మొదటి ముగ్గురు విజేతలకు సర్టిఫికేట్ ఇమెయిల్ ద్వారా పంపబడతాయి.
*ఈ పోటీల మరో లక్ష్యం, విద్యార్థి దశనుండే వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించి, వారిలో భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందిస్తూ, ఆత్మ విశ్వాసం పెంపొందించడం.

Previous
Next Post »
0 Komentar

Google Tags