Motor Vehicle Act
Amendment -2019
మోటారు వాహన చట్ట సవరణ
బిల్లు-2019
➥రహదారిపై డ్రైవింగ్
రూల్స్ పాటించకుండా వన్‌వేలో వెళ్లడం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్న
నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తీసుకురానున్నది.
➥తాగి వాహనంతో
రోడ్డెక్కితే, మైనర్లకు వాహనాలు నడిపితే కారకులకు పెనాల్టీల వాతలు
పెట్టడానికి నిబంధనలు కఠినం చేసింది. ఇకపై ఇలాంటి వారికి భారీగా పెనాల్టీ వేయనున్నారు.
➥ఈ చట్ట సవరణ ద్వారా
వాహన చోదకులకు భరోసా కల్పించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే అంశాల విషయంలో కూడా
తీసుకునే చర్యలను కఠిన తరం చేసింది.
➥జరిమానాలతో పాటు
ట్రాఫిక్ నిబంధన అతిక్రమణ అంశంలో ‘సమాజసేవ’ చేయాలనే
శిక్షను కూడా ఈ చట్ట సవరణతో అమల్లోకి తెస్తున్నారు.
➥రోడ్డు ప్రమాద బాధితుల
రక్షణార్థం చేసే వైద్య సహాయ చర్యలను సదుద్దేశంతో పరిగణించే అంశాన్ని చట్టంలో పొందు
పరిచారు. ఈ విధంగా సహాయం చేసే వారికి పోలీసు, కోర్టు, వేధింపులు
లేకుండా ఈ చట్ట సవరణ దోహద పడుతోంది.
➥అలాగే రోడ్డు
ప్రమాదాలకు రోడ్ల నిర్మాణం లోపమే కారణమైతే సదరు రోడ్డు నిర్వహణ శాఖ నుంచి
పరిహారాన్ని వసూలు చేస్తారు.
➥మైనర్లు వాహనాలు
నడిపితే పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకు రూ.25 వేలు
జరిమానాను విధించడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తే దానికి మూల్యాన్ని కారకుడైన
మైనర్ తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో పాటు వాహన యజమాని కూడా చెల్లించాల్సి
వస్తుంది.
➥వాహన ప్రమాదాల్లో
పరిహారం కోసం దాఖలు చేసుకొనే వ్యాజ్యాలను
ఇకపై ప్రమాదం జరిగిన ఆరు నెలల్లో దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
➥గుర్తు తెలియని వాహనాల
ప్రమాదంలో సంభవించే మరణాల కుటుంబాలకు క్షత్రగాత్రులకు పరిహారాన్ని చెల్లించే ఈ
చట్టంలో పొందు పరిచారు. ఈ పథకం కింద మరణానికి రూ.2 లక్షలు, క్షత్రగాత్రులకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం దక్కేలా చర్యలు చేపడతారు.
➥కొత్తగా వాహన ప్రమాద
నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక పన్నులు, సీజ్‌ల ద్వారా ఈ నిధిని
సమకూర్చుతారు. ఈ నిధి ద్వారా వాహన ప్రమాద బాధితులకు వినియోగిస్తారు.
నిబంధనలు
ఉల్లంఘించిన వారికి జరిమానాలు క్రింది విధంగా ఉండనున్నాయి
0 Komentar