Salary fixation in Promotional cases
ప్రమోషన్ పొందిన సందర్భములలో వేతన స్థిరీకరణ-ఎఫ్
ఆర్22 ప్రాధాన్యత
ఎస్.పి. మనోహర్ కుమార్, ప్రధానకార్యదర్శి, యుటిఎఫ్ కృష్ణాజిల్లా.
*25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టునందు నియమించబడిన వారికి ఈ నిబంధన
వర్తిస్తుంది. 1992, 1998, పిఆర్ స్కేళ్ళలో 8సం. స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్
ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు
పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఎఫ్ ఆర్ 22 (1) ప్రకారం వేతన
స్థిరీకరణ చేయబడేది.
*2005 పీఆర్ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్
అడ్వాన్మెంట్ స్కీమ్ జీవో 241 ఆర్థిక తేదీ: 28.09.2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన
వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణలో రెండు
ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010,2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ,
6/12/18/ స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.
*దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్
ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి
స్టేజివద్ద వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.
1.వాస్తవ ప్రమోషన్ తేదీ నాడు గాని లేదా
2. క్రింది పోస్టులోని తదుపని ఇంక్రిమెంట్ తేదీనాడు
గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.
*జీవో ఎంఎస్ నెం.145, ఆర్థిక, తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే
విధానంలో పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్తో పనిలేకుండానే వేతన
నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది,
ఉదాహరణ: అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ తేదీగా గల
సి.హెచ్. అర్జునరావు అనే ఉపాధ్యాయుడు తేదీ 06.07.2019 న
స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.28940-
78910 స్కేలులో రూ. 44870/-లు గా ఉన్నది. వీరి
వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండువిధాలుగా స్థిరీకరించవచ్చు.
ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:
1. తేదీ 06.07.2019 నాటికి
ఎస్జీటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు : రూ.44870/- స్కేలు
28940 - 78910
2. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం
ఒకనోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు : రూ. 46060/- స్కేలు 28940
- 78910
3. స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన
నిర్ణయం : రూ.47330/- స్కేలు 28940
- 78910
4. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ : 1.07.2020
*ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీకి అంటే జులై నెలకు
మారుతుంది.
క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ:
1. తేదీ 03.07.2019 నాటికి
ఎస్జీటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు : రూ.44,870/- స్కేలు
28940-78910
2. పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22ఎ(1) ప్రకారం వేతన నిర్ణయం : రూ.46060/- స్కేలు 28940-78910
3. తేదీ 110, 2019 న ఎస్ జిది
పోస్టులో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు : రూ.47330/- స్కేలు 28940-78910
4. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక
నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(10/19) న : రూ.47330/- స్కేలు 28940-78910
5. స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో
వేతన నిర్ణయం(10/19)న : రూ.48,600/- స్కేలు
:28940-78910
6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ :1.10.2020
*పై రెండు పద్ధతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం
లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే అక్టోబర్ నెల కొనసాగుతుంది.
*24 సంవత్సరాల
స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఈ నిబంధన వర్తించదు. వారికి ఎఫ్ ఆర్ 22(1)
నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది.Click here to download the above information
I got promotion on 31st october and joined as SA (TEL) ON 1ST NOVEMBER.I UPGRADES FRM LP TELUGU TO SA TELUGU.MY FIRST APPONTMENT WAS 19.10.2009.PLEASE TELL ME HOW MY PAY AND FIXATION? WHICH MONTH IS BENEDIT TO ME I MEAN OCTOBER OR NOVEMBER..
ReplyDelete