Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP RGUKT IIIT Counselling complete details


AP RGUKT IIIT Counselling complete details


నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లలో IIIT ప్రవేశాల పూర్తి సమాచారం
కౌన్సెలింగ్ తేదీలు
➥ఆగస్టు 5, 6 తేదీలలో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్ లకు
➥ఆగస్టు 7, 8 తేదీల్లో శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లకు
➥ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఉదయం 5:30 గంటలకే ఇడుపులపాయలోని రాజీవ్ గేటు వద్దకు చేరుకొని, టోకెన్లు తీసుకోవాలి. అదే శ్రీకాకుళం, నూజివీడులకు ఎంపికైన వారు నూజివీడు ప్రాంగణానికి చేరాలి.
తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ఇవే
➧పదో తరగతి హాల్ టికెట్
➧మార్కుల జాబితా
➧బదిలీ ధ్రువపత్రం
➧4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్
➧ఆధార్ కార్డు
➧రేషన్ ధ్రువపత్రం
➧మీ సేవ కేంద్రాల నుంచి తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. 
➧'నాన్ లోకల్ కోటా కింద ఎంపికైన విద్యార్థి తాను ఉండే ప్రాంతానికి సంబంధించి పదేళ్లు అక్కడ నివాసం ఉన్నట్టు నివాస ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. పైన పేర్కొన్నవన్నీ మూడు సెట్లు సమర్పించాలి.
➧విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగులైతే వారి గుర్తింపుపత్రాలు, తాజా వేతన ధ్రువపత్రం, పాన్, రేషన్, ఆధార్ కార్డులను వెంట తీసుకురావాలి. ఈ ధ్రువ పత్రాలు నాలుగు సెట్ల చొప్పున తేవాల్సి ఉంటుంది.
➧విద్యార్థి, తల్లిదండ్రులకు సంబంధించిన ఆరు పాస్ పోర్టు సైజ్ ఫొటోలను సమర్పించాలి.
➧ఫీజు రీఇంబర్స్ మెంట్ కు అర్హులు కాని విద్యార్థులు రూ. 36 వేల మొత్తా నికి డీడీ తీసుకురావాలి.
ఫీజుల వివరాలు
ఇక్కడ ప్రవేశాలు పొందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. లక్ష లోపు వార్షికాదాయం ఉంటే అన్ని వసతులూ పూర్తి ఉచితంగానే లభిస్తాయి. తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్ మెంట్ కింద ఫీజు మొత్తాన్నీ చెల్లిస్తుంది. మిగిలిన విద్యార్థులు పీయూసీ 1, పీయూసీ 2కు గాను ఏడాదికి రూ. 36 వేల చొప్పున, నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యకుగాను ఏటా రూ.40 వేల చొప్పున రూ. 2. 32 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులు, అధికాదాయం ఉన్న పిల్లలకు ప్రాంగణంలోని బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తారు. విద్యార్థి, వారి తండ్రి గుర్తింపు పత్రాలు, పాన్, రేషన్, ఆధార్, వేతన ధ్రువపత్రాలను సమర్పిస్తే రుణం అందిస్తారు. సదరు విద్యార్థికి ఉద్యోగం వచ్చిన తరువాత ఆ రుణం మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు గాను విద్యా ర్థులు తమ ధ్రువపత్రాలకు సంబంధించిన నాలుగు సెట్ల నకళ్ళు, ఆరు ఫోటోలను ఇవ్వాల్సి ఉంటుంది.
పత్రాలు లేవని గాబరా వద్దు
ఎంపికైన విద్యార్థులకు ఏవైనా ధ్రువపత్రాలు లేనట్లైతే గాబరా పడాల్సిన పనిలేదు. పత్రాలు ప్రవేశాలు ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు ఇతర కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరిపోయారు. వారు ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు బదిలీ సర్టిఫికెట్ ఇవ్వడంలో కానీ, కొందరికి కుల ధ్రువీకరణపత్రాలు, ఇతరత్రా తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అయినా వారు నేరుగా ప్రవేశాలకు హాజరై అధికారులతో మాట్లాడి, రెండు రోజుల్లో సదరు ధ్రువపత్రాలు అందిస్తామని 'అండర్ టేకింగ్ సర్టిఫికెట్ అందించి ప్రవేశాలు పొందవచ్చు. ఒకవేళ ఈ గడువులోగా వారు సదరు ధ్రువపత్రాలు అందించక పోతే వారికి కేటాయించిన సీటును రద్దుచేసి, తరువాత స్థానంలో ఉన్న వారికి కేటాయిస్తారు.


ప్రవేశాలు పొందే విద్యార్థులు కౌన్సెలింగ్ లోని వివిధ దశలను పూర్తిచేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
1.తొలుత విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం ఫైల్ ఇప్పించుకొని దరఖాస్తు నింపాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సంబంధిత శాఖాధికారులచే ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకోవాలి.
2.అనంతరం ప్రవేశాల విభాగం అధికారులతో ధ్రువపత్రా లను పరిశీలింపచేయించుకొని, డేటా ఎంట్రీ చేయించాలి. .
3.ఆ తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. 'కాషన్ డిపాజిట్ కింద ప్రతి విద్యార్థి రూ.2 వేలు చెల్లించాలి.ఆరేళ్ల తరువాత ఈ మొత్తాన్ని సదరు విద్యార్థికి వెనక్కు ఇస్తారు.
4.ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధ నల ప్రకారం ప్రతి విద్యార్థి గ్రూపు ఇన్స్యూరెన్సు కింద రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ విద్యార్థికి బీమా సంస్థ నుంచి పరిహారం అందుతుంది.
5. చివరిగా విద్యార్థులు గుర్తింపుపత్రాన్ని ఇప్పించుకుని బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తరువాత విద్యార్థికి వసతిగృహాన్ని కేటాయిస్తారు. నూజివీడు ప్రాంగణంలో శ్రీకాకుళం, నూజివీడు విద్యార్థులకు కౌన్సెలింగ్.
సీట్ల కేటాయింపు ఇలా..
రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో చోట 1000 చొప్పున మొత్తం 4వేల సీట్లున్నాయి. పదో తరగతిలో వచ్చిన సీట్ల మెరిట్ జీపీఏ ప్రతిపాదికన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో 85 శాతం సీట్లను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, మిగిలిన 15 శాతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఇదివరకే మెరిట్ ప్రతిపాదికన విద్యార్థులను ఎంపిక చేసి ప్రవేశాల కోసం వారికి సమాచారం చేరవేశారు. రాష్ట్రేతర విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల పిల్లలకు మొత్తం సీట్లలో ఐదు శాతం అదనంగా కేటాయిస్తారు. అంతే కాకుండా దివ్యాంగ విద్యార్థులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్ సీసీ కింద 1, క్రీడల కోటా కింద 0.5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. ఈ నాలుగు విభా గాల వారందరికీ కలిపి ప్రత్యేక కేటగిరీ కింద మొత్తం 257 సీట్లు ఉంటాయి. ఇవీ పోను మిగిలిన 3743 సీట్లకు ఇప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్ల రిజర్వేషన్ ఉంటుంది.
వయసు ఎక్కువ ఉన్న విద్యార్థికే ప్రాధాన్యం
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో విద్యార్థుల జీపీఏ సమానంగా ఉన్నప్పుడు వయసు ఎక్కువ ఉన్న విద్యార్థికే ప్రాధాన్యత ఇచ్చి ప్రవేశం కల్పిస్తారు. విద్యా ర్థులను ఎంపికచేసే క్రమంలో విద్యార్థుల మార్కులు సమానం అయినప్పుడు మొదట గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్, మొదటి భాష అంశాల్లో వచ్చిన మార్కులతో పాటు.. పుట్టినరోజు ప్రకారం ఎవరికి ఎక్కువ వయస్సు ఉంటే వారికి సీటు కేటాయిస్తారు.


ఇడుపులపాయ ప్రాంగణానికి ఇలా రండి...
ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులు తొలుత కడపకు చేరుకొని, తరువాత వేంపల్లె మీదుగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి రావాల్సి ఉంటుంది. కడప, పులివెందులల నుంచి ప్రతి అర గంటకు ఒక ఆర్టీసీ బస్సు చొప్పున నడుస్తాయి. రాయచోటి నుంచి వేంపల్లెకు ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. బస్సుల్లో వచ్చే విద్యార్థులు వేంపల్లెలోని నాలుగురోడ్ల కూడలికి చేరుకుంటే అక్కడి నుంచి ప్రతి 20 నిమి షాలకు ఒక ఆటో అందుబాటులో ఉంటుంది. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు జరిగే రోజుల్లో ప్రతి అరగంటకు వర్సిటీకి చెందిన బస్సు వేంపల్లెకు వచ్చిపోతూ ఉంటుంది. దీనికితోడు పులివెందుల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడి పేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
నూజివీడు క్యాంపస్ కు ఇలా రావొచ్చు..
నూజివీడు ట్రిపుల్ ఐటీకి శ్రీకా కుళం, విశాఖపట్నంల వైపు నుంచి వచ్చే విద్యార్ధులు హనుమాన్ జంక్షన్(నూజివీడు) రైల్వే స్టేషనులో దిగాలి. అక్కడి నుంచి జంక్షన్ బస్టాండుకు చేరుకొని, బస్సులో నూజివీడుకు రావచ్చు. ఆటోలు అయితే నేరుగా ట్రిపుల్ ఐటీ వద్దకు వస్తాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల వైపు నుంచి వచ్చేవారు విజయవాడలో దిగి, అక్కడి నుంచి బస్సుల ద్వారా నూజివీడుకు చేరుకో వచ్చు. నూజివీడు బస్టాండు నుంచి మైలవరం వైపు వెళ్లే బస్సులు లేదా ఆటోల్లో ట్రిపుల్ ఐటీకి చేరుకోవచ్చు.
వివిధ కోర్సుల వివరాలు
ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు అందించనున్నారు. ప్రీ యూనివర్సిటీ కోర్సు కింద మొదటి, రెండో సంవత్సరాల్లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు, ఐటీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి. తరువాత మిగిలిన యూనివర్సిటీల మాదిరే సివిల్, కెమికల్, మెకాని కల్, ఈసీ, సీఎస్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ కోర్సులుంటాయి. అనంతరం జీపీఏ, సామాజిక వర్గాల ప్రాతిపదికన వారు కోరుకున్న ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి రెండేళ్లు ఐటీ, ఇంగ్లిష్ అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
ఇక్కడ చేరే విద్యార్థులు 'డ్యుయల్ డిగ్రీ' పొందే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో జీపీఏ 8కు పైగా సాధించిన విద్యార్థులకు ఈ వెసులు బాటు ఉంది. రెండో సంవత్సరం నుంచి రెగ్యులర్ కోర్సులతో పాటు మైనర్ కోర్సుల కింద శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఇతర అదనపు కోర్సులు చేస్తూ డ్యుయల్ డిగ్రీ పొందవచ్చు. అంతేకాకుండా ఈ విద్యార్ధులు బీటెక్ చివరి రెండేళ్లు ఇంటర్న్షిప్ కోసం బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

మూలం: ఈనాడు దినపత్రికలోని సమాచారం 
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఈనాడు దినపత్రిక లో వచ్చిన కథనం ఆధారంగా ఇవ్వబడినది. ఇందులో ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉండవచ్చు. కావున పూర్తి సమాచారం కోసం సంభందిత అధికారులను లేదా అధికారిక వెబ్సైట్ లను చూడగలరని మనవి. తప్పులు లేదా మార్పులకు మేము భాధ్యులము కాము.
Previous
Next Post »

2 comments

  1. Is there any vaccancies in aprgukt idupulapaya

    ReplyDelete
    Replies
    1. News on 14-10-2021: చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి: 175 మంది బోధన సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే inform చేస్తాము మా వెబ్సైట్ లో. Thanks.

      Delete

Google Tags