Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Grama,ward Sachivalayam exams Instructions to the Candidates

Grama,ward Sachivalayam exams Instructions to the Candidates
స‌చివాల‌య రాత పరీక్షలు అభ్యర్థులకు ముఖ్య సూచనలు
★ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
★ పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
★ మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
★ అభ్యర్థులు హాల్‌టికెట్‌‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి.
★ ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.
★ ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్‌లో జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు.
★ దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.
★ ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు.
★ కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.
★పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.
★నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచన.


Previous
Next Post »
0 Komentar

Google Tags