Vindam Nerchukundam IRI 27th August Radio Programme
"విందాం - నేర్చుకుందాం"-నేటి రేడియో పాఠం
★ తేది : 27.08.2019
★ విషయము : గణితం
★ పాఠం పేరు : "తీసివేత (వ్యవకలనం)"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
తీసివేత (వ్యవకలనం)
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• రెండంకెల సంఖ్యల తీసివేత ప్రక్రియల ద్వారా సమస్యలను సాధించగలరు.
• మూడంకెల సంఖ్యల తీసివేత సమస్యలు సాధించగలరు.ఫలితాన్ని అంచనా వేయగలరు.
• స్థాన విలువల ఆధారంగా ఇచ్చిన సంఖ్యల భేదాన్ని (తీసివేత) కనుగొనగలరు.
బోధనాభ్యసన సామగ్రి:
• 0-9 సంఖ్యలు రాసిన ఫ్లాష్ కార్డులు (3 సెట్లు)
• పాఠ్యపుస్తకం
కార్యక్రమంలో నిర్వహించవలసిన కృత్యాలపై అవగాహన :
ఎ. కృత్య నిర్వహణపై అవగాహన
బి. ఆట నిర్వహణపై అవగాహన
కృత్యం :1
• ముందుగా పిల్లలందరిని గుండ్రంగ కూర్చోబెట్టాలి.
• ముందుగా రేడియో టీచర్ ఒక సంఖ్య చెబుతారు. తరువాత ప్లస్ అనగానే ఐదు కలిపి వచ్చిన సమాధానం చెప్పాలి. మైనస్ అవగానే ఐదు తీసివేసి వచ్చిన జవాబు చెప్పాలి.
• తప్పుగా చెప్పిన వారు ఆట నుండి ఔట్ అయినట్లుగా భావించాలి.
• ముందుగా మామయ్య చెపుతుంటే రాజు, లతలు సమాధానాలు చెపుతారు.
• ముందుగా మామయ్య చెప్పే సంఖ్య వంద దానికి ప్లస్ అనగానే రాజు 105 అని చెపుతారు. తరవాత ప్లస్ అనగానే లత 110 అని చెపుతుంది.
• తరువాత మామయ్య మైనస్ అనగానే రాజు 105 అని ప్లస్ అనగానే లత 110 అని చెపుతుంది.
• తరవాత గుండ్రంగా కూర్చున్న తరగతి పిల్లలు ఆట ఆడాలి.
• రేడియో టీచర్ ముందుగా నూటయాభై అని సంఖ్య చెప్పగానే గుండ్రంగా కూర్చున్న పిల్లల లో నుండి ఒకరి నుండి మొదలు పెట్టి రేడియో టీచర్ ప్లస్ అనగానే 5 కలుపుతూ మైనస్ అనగానే 5 తీసివేస్తూ ఆడాలి
• టీచర్ సరిగా చెప్పిన వారిని అభినందించాలి.
కృత్యం :2 ఆట
• తరగతిలోని పిల్లలందరిని రెండు సమాన గ్రూపులు చేయాలి.
• ముందుగా రాసిన రెండంకెల సంఖ్యల చిట్టీలను ఒక డబ్బాలో మూడంకెల సంఖ్యల చిట్టీలను మరొక డబ్బాలో వేయాలి.
• తరువాత మొదటి గ్రూపునుండి ఇద్దరు పిల్లలు వచ్చి రెండు డబ్బాల నుండి ఒక్కో చిట్టీ తీయాలి.
• తీసిన చిట్టీల నుండి పెద్ద సంఖ్యను ముందుగా నల్లబల్లపై రాసి తరువాత చిన్న సంఖ్యను దానికింద రాయాలి.
• తరువాత రెండవ గ్రూపు వారిలో ఒక విద్యార్థి నల్లబల్ల వద్దకు వచ్చి అంతకు ముందు నల్లబల్లపై రాసిన సంఖ్యల తీసివేత చేయాలి.
• లెక్క సరిగా చేసిన వారికి ఒక పాయింట్ ఇవ్వాలి.
• తరువాత రెండవ గ్రూపు నుండి ఇద్దరు విద్యార్థులు రెండు డబ్బాల నుండి చిట్టీలు తీసి ఆ సంఖ్యలను నల్లబల్లపై రాయాలి.
• తరువాత మరొక గ్రూపు నుండి మరొక విద్యార్థి నల్లబల్ల వద్దకు వచ్చి ఇంతకు ముందు మాదిరిగా తీసివేత చేయాలి.
• సరిగా చేసిన వారికి ఒక పాయింట్ ఇవ్వాలి.
• రేడియో కార్యక్రమప్రసారానంతరం ఆటను కొనసాగించండి.
➤కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట
పల్లవి :
తీసివేతయే వ్యవకలనం
వ్యవకలనముయే తీసివేత //తీసివేతయే//
చరణం 1:
సమూహాలతో ఉన్న వస్తువుల
భేదమెంతో తెలియాలంటే
పెద్ద సమూహాలలో సంఖ్యలో నుండి
చిన్న సమూహము సంఖ్యను తీసేయడమే //తీసివేతయే//
చరణం 2:
నీ దగ్గర ఉన్న మొత్తము డబ్బూ ఎంతో తెలుసూ
నీవు ఖర్చు చేసిన సొమ్ము ఎంతో
అది కూడా నీకు తెలుసూ
ఇప్పుడు మిగిలిన సొమ్మెంతో
తెలియాలంటే .... తీసివేయడమే //తీసివేతయే//
తీసేయాలంటే ........
ఏ స్థానంలోని అంకెను
ఆ స్థానంలోని అంకె కిందనే వేయాలి
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
📻'విందాం నేర్చుకుందాం' IRI కార్యక్రమాలు లైవ్ లో వినిపించుటకు ఉపయోగపడే ఆకాశవాణి ప్రసారభారతి యాప్
Click here to download...Prasarabharathi News on Air app
📻'విందాం నేర్చుకుందాం' IRI కార్యక్రమాలు లైవ్ లో వినిపించుటకు ఉపయోగపడే ఆకాశవాణి ప్రసారభారతి యాప్
Click here to download...Prasarabharathi News on Air app
0 Komentar