Amma vodi scheme
Instructions
అమ్మఒడి
పధకం నిర్వహణ-వివరణ
జిల్లా
విద్యాశాఖాధికారి, తూర్పు గోదావరి, కాకినాడ
వారి ఉత్తర్వులు
ప్రస్తుతము:
శ్రీ ఎస్.అబ్రహం, ఎం.ఎ., ఎం.ఎ.
(ఎడ్యుకేషన్)
File No:
DEO-SE-MEO/11/2019-SA-A6(DEO-EG), తేది.16/09/2019
విషయము: పాఠశాల
విద్య - అమ్మఒడి పధకం నిర్వహణ - పాఠశాలల గుర్తింపు ప్రతిపాధనలు ది.20-09-2019
నాటికి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునకు సమర్పించుట - గురించి.
సూచిక:- జిల్లా
విద్యాశాఖాధికారి, తూర్పు గోదావరి, కాకినాడ
వారి ఉత్తర్వులు,తేది. 05-09-2019.
@@@@
జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల
విద్యాశాఖాధికారులకు తెలియ జేయునదేమనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు
ప్రతిష్టాత్మకంగా చేపట్టుచున్న " అమ్మఒడి" కార్య క్రమమును అన్ని
పాఠశాలలలో అర్హులైన బాల బాలికలకు అమలు పరచ వలసి యున్నది. ఈ కార్యక్రమము ప్రభుత్వ
గుర్తింపు పొందిన పాఠశాలలకు మాత్రమే వర్తిచును. ఈ విషయమును సంబంధిత అధికారులు
అందరూ గుర్తించి ప్రభుత్వ కార్యక్రమమును అమలు పరచ వలసియున్నది.కావున అందరు ఉప
విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులు మీ పరిధిలోని
ప్రైవేటు పాఠశాలలన్నింటికీ గుర్తింపు కలిగియుండేటట్లు చర్యలు తీసుకొనవలయును.
గుర్తింపు ప్రతిపాధనలు జిల్లా విద్యాశాఖాధికారి, తూర్పు
గోదావరి, కాకినాడ వారి కార్యాలయమునకు ది.20-092019 లోపున
సమర్పించవలసినదిగా ఆదేశించడమైనది. ప్రభుత్వ కార్య క్రమము " అమ్మఒడి"
అమలుకు ఏమైనా ఆటంకములు వచ్చినయెడల దానికి సంబంధిత తనిఖీ అధికారులు భాధ్యులగుదురని
తెలియజేయడమైనది. .
“అమ్మఒడి" పధకము అమలుకు
సంబంధించి పాఠశాలలలోని విద్యార్థుల వివరములు ఈ క్రింద పొందు పరచిన పట్టికలో
ఇవ్వవలసినదిగా అందరు మండల విద్యాశాఖాధికారులను ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను
ఆదేశించడమైనది.
తదుపరి అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల
విద్యాశాఖాధికారులకు తెలియజేయునదే మనగా ది.20-09-2019 నాటికి గుర్తింపు
ప్రతిపాదనలు పంపవలసిన పాఠశాలలు ఏమియూ లేవని ధృవీకరణ పత్రమును సమర్పించ వలసినదిగా
ఆదేశించడమైనది.
ఈ ఉత్తర్వులు అత్యంత జరూరుగా భావించవలెను.
ABRAHAM SALNATI,
జిల్లా
విద్యాశాఖాధికారి వారి కార్యాలయము,
తూర్పుగోదావరి, కాకినాడ.
0 Komentar