AP YSR Rythu bharosa scheme details
వైఎస్సార్
రైతు భరోసా పధకం
వైఎస్సార్ రైతు
భరోసాను అక్టోబరు 15 నుంచి అమలు
చేస్తున్నది విదితమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కలిపి భూములున్న ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు రాష్ట్రమే రూ.13,500 ఇస్తుంది. కుటుంబం యూనిట్‌గా పథకం అమలవుతుంది.
భార్య, భర్త, పిల్లలను
కుటుంబంగా పరిగణిస్తారు. పెళ్లయినవారిని మరో యూనిట్‌గా తీసుకుంటారు.
రైతు భరోసా పథకం ఈ క్రింద విధంగా ఉన్న రైతులకి మాత్రమే వర్తిస్తుంది.
1.సొంతంగా భూమి ఉంటే 10 సెంట్లు నుండి 5 ఎకరాలు ఉన్న ప్రతీ రైతుకి ఈ పధకం వర్తిస్తుంది.
2..భూ యజమాని చనిపోతే అతని భార్యకి ఈ పథకం వర్తిస్తుంది.
3.తల్లితండ్రులు
చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో ఒకరికి మాత్రమే కౌలు కి చేసినట్లు అవుతుంది.
4.కౌలు రైతు
అయినట్లయితే 50 సెంట్లు లేదా అంత కంటే ఎక్కువ సాగు చేస్తూ.... అతని పేరునా భూమి లేనట్లయితే ఈ పథకం వర్తిస్తుంది.
5.భూ యజమాని అంగీకారంతోనే కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది.
6.భూ యజమాని తన భూమిని 3 లేదా 4 కి కౌలుకి ఇచ్చినట్లయితే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతులలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
7.D పట్టా భూముల్లో సాగు చేస్తున్నా రైతులకి కూడా ఈ
పథకం వర్తిస్తుంది.
8.ఆన్ లైన్ లో భూమి నమోదు కాని రైతు కి కూడా ఈ పధకం వర్తిస్తుంది.
9.ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్నా రైతులు కూడా ఈ
పధకం వర్తిస్తుంది.
10.స్థానిక సంస్థల్లో
పనిచేస్తున్నా ఉద్యోగుల్లో (గుమాస్తాలు, క్లాస్ 4
సిబ్బంది, గ్రూప్ D )రైతులు
ఉన్నచో ఈ పథకం వర్తిస్తుంది.
రైతు భరోసా
పథకం ఈ క్రింది విధంగా ఉన్న రైతులకి వర్తించదు.
1. సంస్థల పేరుతో భూములున్న వారు
2. రాజ్యాంగపదవుల్లో ఉన్న తాజా, మాజీ సభ్యులు, మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ
సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు
3. ప్రస్తుత, పదవీవిరమణ
చేసిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వ
ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థలు, స్వతంత్ర
సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు
(మల్టీటాస్కింగ్ స్టాఫ్, నాలుగోతరగతి, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు)
5. నెలకు రూ.10వేల పైన పింఛను పొందేవారు
(మల్టీటాస్కింగ్ స్టాఫ్, నాలుగో తరగతి, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు)
6.
వ్యవసాయ భూములను ఇల్లా పట్టాలుగా మార్చుకుంటే ఈ పథకం వర్తించదు.
7. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చుకున్నా కూడా ఈ పథకం వర్తించదు.
8. గత
ముగింపు సంవత్సరానికి వాణిజ్య
వృత్తి పన్నులు (Tax), GST చెల్లించిన వారికీ ఈ పథకం వర్తించదు.
9.
వృత్తిపరమైన సంస్థల క్రింది రిజిస్టరై తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు,
లాయర్లు, ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్క్ లు కూడా వర్తించదు.
10.
నెలకి రూ 10000 లేదా అంతకంటే ఎక్కువ పింఛన్ పొందుతున్నా వారికి ఈ పథకం
వర్తించదు.
11.
భూమి .... భూ యజమాని ( తండ్రి లేక తల్లి
)పేరున ఉంటే..... వాళ్లలో
ఎవరైనా బ్రతికి ఉంటే.....
ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారసులకు ఈ పథకం వర్తించదు.
12. బంజరు లేదా బీడు భూములకు
ఈ పథకం వర్తించదు.
కౌలు
రైతుల విషయంలో
* ఒక భూయజమాని, ఒక కౌలు రైతు
మధ్యే ఒప్పందం కుదుర్చుకోవాలి.
* ఒకే భూయజమాని నలుగురైదుగురితో కౌలు ఒప్పందం
చేసుకుంటే అందులో ఒకరినే అర్హులుగా గుర్తిస్తారు.
* అర్హుల జాబితాలను గ్రామపంచాయతీల్లో ప్రకటించి
అభ్యంతరాలు స్వీకరించాలి.
కౌలు రైతులైతే ఎంత భూమి?
* కౌలు రైతులకు సొంత భూమి ఉండకూడదు.
* కుటుంబసభ్యులతో చేసుకునే కౌలు ఒప్పందాలకు పథకం
వర్తించదు.
* ఒక కౌలురైతు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఒక
యూనిట్‌గానే పరిగణిస్తారు.
* ఒకే గ్రామానికి చెందిన సన్నకారు రైతు, కౌలుదారు మధ్య ఒప్పందాన్ని గుర్తించరు.
* భూయజమానులతో పాటు వాటిని సాగుచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులూ ప్రయోజనానికి అర్హులే.
Good information
ReplyDelete