Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Dr.YSR Kanti Velugu–Mass Eye Screening Programme details

Dr.YSR Kanti Velugu–Mass Eye Screening Programme details

వైఎస్ఆర్ కంటివెలుగు పథకం
 ఈ నెల 10 నుండి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రకటన.
 పథకాన్ని ఐదు దశలలో అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.
 ఒకటి, రెండు దశలలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు,
 మిగతా మూడు దశలలో కమ్యూనిటీ బేస్ పద్ధతిలో కంటి పరీక్షలు చేయాలని నిర్ణయం.
పథకం అమలు ఇలా...
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠశాలల్లోనే కంటి పరీక్షలు జరుపుతారు. ఆయా పరీక్షల్లో ప్రాథమిక దృష్టి దోషాలను గుర్తించి వారి పేర్లను కంటి వెలుగు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మొత్తం ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రాథమిక స్ర్కీనింగ్‌ శిబిరాల్లో గుర్తించిన పిల్లలకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు దృష్టి దోషాలు నిర్ధారిస్తారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పీహెచ్‌సీ వైద్యాధికారులు పాఠశాలకు వచ్చి పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు.
సాధారణ ప్రజలకు ఇలా...
రెండో దశలో జిల్లాలో సాధారణ ప్రజలకూ కంటి పరీక్షలు చేస్తారు. ఇటీవల కొత్తగా ప్రభుత్వం నియమించిన గ్రామ వలంటీర్ల సేవలను ఇందులో వినియోగించుకుంటారు. వలంటీర్లు తమకు నిర్ధేశించిన గృహాలకు వెళ్లి స్నెలెన్స్‌ చార్ట్‌లతో కంటి పరీక్షలు జరుపుతారు. దృష్టి లోపాలు ఉన్న వారి పేర్లను నమోదు చేసుకుని కంటి వెలుగు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్లు బాధితులకు తదుపరి కంటి పరీక్షలు జరిపి దృష్టి దోపాలను నిర్ధారిస్తారు. కళ్లజోళ్లు అందజేస్తారు. శుక్లాలు ఇతర శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ప్రభుత్వాస్పత్రులకు సిఫార్సు చేస్తారు.
ఉపాధ్యాయులకు సూచనలు
ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.
ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షం లో విద్యార్థులకు  కంటి తనిఖీ లను నిర్వహిస్తారు.
దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం జరిగినది.
వీటి వినియోగం ఇలా.........
మంచి వెలుతురు వున్న ప్రదేశం లో కంటి తనిఖీ లు జరగాలి.
విద్యార్థి నిలుచున్న దగ్గర నుంచి మూడు మీటర్ల దూరం ను టేపు సహాయం తో కొలిచి విద్యార్థి తలకు సమాంతరంగా విజన్ చార్ట్ ను గోడకు పేస్ట్ చేయాలి.
విద్యార్థి నిలుచునే ప్రదేశాన్ని సుద్ధ ముక్క తో మార్క్ చేసి విద్యార్థిని అక్కడ నిలబెట్టాలి.
విద్యార్థులు కంటి పరీక్షలు జరుగుతున్న ప్రదేశం లో ఎక్కువ మంది లేకుండా చూడాలి.
ఇది వరకే కంటి అద్దాలు వాడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు తోనే తనిఖీ నిర్వహించాలి.
ప్రదర్శన.
పరీక్షా ప్రక్రియ చేపట్టే ముందు E అక్షరం యొక్క కొసలు ఏ వైపు కు వున్నాయనే విషయం చేతితో ఊపి ఏ విధంగా చెప్పాలో సూచించండి.
పరీక్షా చేయించుకునే విద్యార్థి పరీక్షలో ఎలా చెప్పాలో,చూపించాలి, అనే విషయం అర్ధం అయ్యింది అని నిర్ధారించుకున్న తరువాత ప్రక్రియ మొదలు పెట్టండి.
పరీక్షించే విధానం.
మొదటి లైన్ పెద్ద "E" 
కనీసం రెండు అక్షరాలు చెప్పగలిగితే లేదా చుపించంగలిగితే తరువాత స్టెప్ కు వెళ్ళాలి.
ఒక్క అక్షరం లేదా ఏ అక్షరం సరిగ్గా చెప్పడం లేదా చూపించనప్పుడు కంటి పరీక్షలు సూచించాలి.
రెండవ లైన్.. చిన్న E
కనీసం 4 అక్షరాలు చెప్పగలిగే లేదా చూపించ గలగాలి.
మూడు లేదా అంతకు తక్కువ అక్షరాలు చెప్పడం లేదా చూపించక పోతే కంటి పరీక్ష సూచించాలి..
ముందు కుడి కన్ను తరువాత ఎడమ కన్ను ను ఇదే విధంగా పరీక్షించాలి....
గమనిక
విద్యార్థికి కంటి పరీక్ష చేసేటప్పుడు తన రెండవ కంటిని మృదువుగా మూసుకోమని చెప్పాలి.
సంపూర్ణ కంటి పరీక్షా
కళ్ళు రెండింటి లో ఏ ఒక్క దానిలో నైనా దృష్టి పరీక్షలో ఫెయిల్ అయినట్లయిన
టార్చ్ లైట్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్థితి గమనించినా
ఇతర కంటి సంబంధిత సమస్యలు వున్నవారు.
వీరిని పూర్తి కంటి పరీక్షకు పంపించాలి.
గమనించండి

ఈ కార్యక్రమం పూర్తి అయ్యే లోగా దృష్టి లోపం వున్న వారు,లేనివారు ఈ ప్రాథమిక దశ లో నిర్ధారణ జరగాలి.
ఆరోగ్య సిబ్బంది - ప్రాథమిక కంటి పరీక్షలకు సూచనలు
1. బాగా వెలుతురుగా ఉన్న గదిని కంటి పరీక్షల కొరకు ఎంపిక చేసుకోవాలి.
2. విజస్ కిట్ లోని 'E' చార్ట్ ను గదిలో / వరండాలో వెలుతురు ఉన్న వైపు ఉంచాలి.
3. 'E' చార్టుకు ఎదురుగా 3 మీటర్ల దూరమును విజన్ కిట్ లోని టేప్ సహాయముతో కొలిచి అక్కడ ఒక గుర్తును ఉంచాలి.
4. 'E' చార్ట్ నుంచి ఎదురుగా 3 మీటర్ల దూరములో ఉంచిన గుర్తు దగ్గర పాఠశాల విద్యార్థిని ఉంచి చూపు పరీక్షను నిర్వహించాలి.
5. విద్యార్థి కంటి అద్దములు వాడుచున్నట్లయితే, కంటి అద్దములు ఉంచి చూపు పరీక్ష నిర్వహించాలి.
6. మొదట కుడి కంటిని, తరువాత ఎడమ కంటిని వేరువేరుగా చూపు పరీక్ష నిర్వహించాలి.
7. కుడి కన్ను పరీక్ష చేయునప్పుడు, ఎడమ కన్ను మీద ఎటువంటి వత్తిడి కలుకుండా మూసి ఉంచాలి.
8. అలాగే ఎడమ కన్ను పరీక్షచేయునప్పుడు, కుడి కన్ను మీద ఎటువంటి వత్తిడి కలుకుండా మూసి ఉంచాలి.
9. కుడి కన్ను, ఎడమ కన్ను వేరువేరుగా చూపు పరీక్ష కొరకు ఎదురుగా ఉన్న చార్ట్ లోని ముందువైపు ఉన్న పెద్ద “E” 4 అక్షరాలలో 3 అక్షరాలు, వెనుకవైపు ఉన్న చిన్న "E" 4 లక్షరాలలో 3 లక్షరాలు సక్రముగా చెప్పినచో చూపు బాగా ఉన్నట్టు, చెప్పకపోతే దృష్టిలోపము ఉన్నట్టుగా గుర్తించాలి.
10. సక్రమంగా ఉంటే ప్రాథమిక కంటి పరీక్ష పుస్తకంలో N - అని, చెప్పకపోతే AB అని నమోదు చేయవలెను.
11. తదుపరి ప్రతి విద్యార్థి కుడి, ఎడమ కన్నులను టార్చిలైట్ సహాయముతో ఏమైనా లోపాలు (ఎరుపు, మెల్ల, కంటిపూత మొదలగునవి) కొరకు పరీక్షించాలి.
12. చూపు పరీక్షను, టార్చిలైట్ పరీక్షా వివరాలను మొదటి దశ - విద్యార్థి మెడికల్ రికార్డు - | (కార్డు) మీద నమోదు చేసి సంతకము చేసి పాఠశాల విద్యార్థి చేతికి ఇవ్వవలెను. సక్రమంగా ఉంటే ప్రాథమిక కంటి పరీక్షపుస్తకంలో N - అని, చెప్పకపోతే AB అని నమోదు చేయవలెను.
13. పాఠశాల విద్యార్థి ని తదుపరి కంటి పరీక్షల కొరకు రిఫరల్ చేయబడినచో ఆ విషయాన్ని విద్యార్థికి తెలియచేయాలి.
14. ప్రాథమిక కంటి పరీక్షల వివరాలను స్కూల్ స్కీనింగ్ రికార్డు - 1 (పుస్తకము) లో కూడా నమోదు చేయవలెను.
15. ఆశా స్కూలు పుస్తకము లోని వివరాలను, “వై యస్ ఆర్ కంటి వెలుగు" ప్రత్యేక వెబ్ సైట్ (http://drysrku.ap.gov.in) లో ప్రాథమిక / పట్టణ ఆరోగ్య కేంద్రంల లోని కంప్యూటర్ల ద్వారా యూసర్ id (user id), పాస్ వర్డ్ (password) ల సహాయముతో సంబంధిత ఏ ఎస్ యం (ANM) జాగ్రత్తగా తప్పులు లేకుండా నమోదు (upload) చేయాలి.

Prakasam district Complex wise Teachers allotment and eye scanning dates
Click here for Basic eye screening test Hand book
Click here for Preliminary tests data entry sheet
Click here for detailed guidelines
Click here for User manual to upload screening test results
Previous
Next Post »
0 Komentar

Google Tags