Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Grama Sachivalayam employees Rules Finalize & Job chart

Grama sachivalayam employees rules finalize


‘సచివాలయ’ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు 
మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌ 
వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌  
ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం అపాయింట్‌మెంట్‌ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్‌ ఆర్డర్లు
➤గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది.
➤గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది.
➤ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.
➤పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.
➤సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్‌ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్‌ ఇస్తారు.
➤వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు అన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
➤వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్‌ ఇస్తారు.
➤ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు.
➤నేడు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ ఉద్యోగులకు లాంఛనప్రాయంగా నియామక పత్రాలు అందజేసిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

గమనిక:గ్రామ సచివాలయం పరీక్షలలో మీరు ఎంపిక కాబడిన ఈ దిగువ సూచించిన పోస్ట్ ల నుండి మీరు ఇష్టపూర్వకంగా ఒక పోస్ట్ ని ఎంపిక చేసుకొనుటకు 'Accepted' ఆప్షన్ ను ఎంచుకోగలరు. మిగిలిన పోస్టులలో చేరుటకు నిరాసక్తత వ్యక్తపరుస్తూ 'Relinquished' ఆప్షన్లను ఎంపిక చేసుకుని, 'submit Details' బటన్ ని ప్రెస్ చేయగలరు.
Download...Post Acceptance/Relinquishment Service For Selected Candidates
Download....Job Chart of the Village Secretariat Functionaries
Previous
Next Post »
0 Komentar

Google Tags