Guidelines for Blood Pressure Consideration
రక్తపోటు పరిగణనకు మార్గదర్శకాలు
>129/84...
ఇది సాధారణ రక్తపోటుగానే పరిగణించాలి. 139/89ని
హై నార్మల్ రక్తపోటుగా పరిగణించాలి.
>140/90గా రీడింగ్ ఉంటేనే దానిని
అధిక రక్తపోటు వ్యాధిగా గుర్తించాలని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా
(ఏపీఐ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రకటించింది...
>దీని ప్రకారం సిస్టోలిత్ విలువ 120-129 మధ్య ఉంటే, డయాస్టోలిక్ విలువ 80-84 మధ్య ఉంటే సాధారణంగానే భావించాలి.
>130/85 నుంచి 139/89 మధ్య విలువ ఉంటే దానిని హైనార్మల్ పరిస్థితిగా గుర్తించాలి.
>ఇక గ్రేడ్-1 హై బీపీగా 140/90, గ్రేడ్-2 హైబీపీగా 160/100, గ్రేడ్-3 హైబీపీగా 180/110 గుర్తించాలని వైద్యనిపుణులు ప్రకటించారు.
సాధ్యమైనంత వరకు గ్రేడ్-1లోపే బీపీని
నియంత్రణలో ఉంచుకోవాలని సదస్సు పిలుపు నిచ్చింది.
ఉత్తుత్తి బీపీ!...పరీక్షించేప్పుడే పెరుగుతున్న రక్తపోటు
బీపీ... ఓ చిత్రమైన సమస్య... కొందరిలో అధిక
రక్తపోటు ఉండదు... కానీ ఆసుపత్రిలో వైద్యుడు పరీక్షిస్తున్నప్పుడు మాత్రం అది
అమాంతం పెరిగిపోతుంటుంది. ఈ రకం రక్తపోటును ‘వైట్‌కోట్
హైపర్ టెన్షన్’ అంటారు. అధిక రక్తపోటు సమస్య యువతలోనూ
ఎక్కువగానే ఉంది. అయినా బాధితుల్లో చాలామందికి తమకు బీపీ ఉన్నట్లే తెలియకపోవడం
గమనార్హం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధిక రక్తపోటును గుర్తించేందుకు సరైన
విధానాలు లేవని, ఒక్కసారి బీపీ పరీక్షించి నిర్ధారణకు
రాకుండా.. వారంలో వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా బీపీ చూసి నిర్ధారణకు రావాలని,
లేదంటే 24 గంటలపాటు పూర్తిగా పర్యవేక్షించిన
తర్వాత ఒక నిర్ణయానికి రావాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
వైట్‌కోట్ హైపర్‌టెన్షన్.. ఏం చెయ్యాలి?
వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే కనిపించే హైబీపీ సమస్యకు మందుల
అవసరం ఉండదు. వీరు ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, నిత్యం
గంట వ్యాయామం, సరైన నిద్ర, ఆందోళన
తగ్గించుకోవడం వంటి చర్యలతో బీపీని నియంత్రణలో పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు.
వీరు అనవసరంగా మందులు వాడటం వల్ల హైపోటెన్షన్ (తక్కువ రక్తపోటు)కు దారి తీయవచ్చని
నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారికి ఒక పరీక్షతోనే నిర్ధారణకు
రాకుండా.. వారంలో 3-4 సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
మాస్డ్క్ హైపర్‌టెన్షన్
కొందరిలో ఇంట్లో పరీక్ష చేసుకుంటే అధిక రక్తపోటు కనిపిస్తుంది.
ఆసుపత్రికి రాగానే తగ్గిపోతుంది. ఇలాంటి బీపీని ‘మాస్డ్క్
హైపర్‌టెన్షన్’ అంటారు. వీరు వైద్యుడి దగ్గరకు వెళితే అధిక
రక్తపోటు లేదని చెప్పి ఔషధాలు ఇవ్వడం లేదు. ఇలాంటివారిలో కొన్నిసార్లు గుండె విఫలం
కావడం, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం
తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి.
మెట్రో నగరాల్లో ఎక్కువగా ఉంది
జీవనశైలి మార్పు, అధిక మసాలాలు తినడం వల్ల
ఎక్కువ మంది హైపర్‌టెన్షన్ బారిన పడుతున్నారు. మెట్రో నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా
కనిపిస్తోంది. ఇంట్లో ఎప్పటికప్పుడు బీపీ పరీక్షించుకునే వెసులుబాటు ఉండాలి.
ముఖ్యంగా గర్భిణులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు
హోమ్ బ్లడ్ ప్రెజర్ మానిటర్లు అందుబాటులో పెట్టుకోవాలి.
Guidelines
for Blood Pressure Consideration
0 Komentar