Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

International Day for the Preservation of the Ozone Layer 


September 16: International Day for the Preservation of the Ozone Layer

నేడు (సెప్టెంబర్ 16) ఓజోన్‌ దినోత్సవం సందర్భంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు 

======================

వాతావరణ శాస్త్ర అధ్యయనం ప్రకారం భూ వాతావరణాన్ని ఐదు ప్రధాన పొరలుగా విభజిస్తారు. నేల నుంచి సుమారు 20 కి.మీ. వరకు విస్తరించిన పొరను 'ట్రోపోస్ఫియర్‌' అంటాము. ట్రోపోస్ఫియర్‌ పైభాగాన సుమారు 30 కి.మీ. మందాన అంటే నేల నుంచి సుమారు 50 కి.మీ. ఎత్తు వరకు ఉన్న పొరను 'స్ట్రాటోస్ఫియర్‌' అంటారు. మనం మాట్లాడుకుంటున్న ఓజోన్‌ పొర ఉండేదీ ఇక్కడే! ఆ తర్వాత 35 కి.మీ. మందాన అంటే భూమి నుంచి సుమారు 85 కి.మీ. వరకు విస్తరించి ఉన్న వాతావరణ పొరను 'మీసోస్ఫియర్‌' అంటారు. మీసోస్ఫియర్‌కు పైభాగాన సుమారు 600 కి.మీ. మందాన అంటే నేల నుంచి సుమారు 700 కి.మీ. వరకూ విస్తరించి ఉన్న పొరను 'óర్మోస్ఫియర్‌' అంటాము. ఆ పైభాగాన దాదాపు 10 వేల కి.మీ. వరకూ విస్తరించిన వాతావరణ భాగాన్ని 'ఎక్సోస్ఫియర్‌' అంటాము. ఇక ఆ పైభాగాన ఉన్నదంతా 'అంతరిక్షం' (space)

సూర్యుని నుండి విడుదలయ్యే సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటూ వాటి నుంచి భూమిపై ఉన్న జీవజాలాన్ని రక్షిస్తున్నదే ఓజోన్ పోర.ఇది అతినీల లోహిత కిరణాలను వడపోసి సూర్యరశ్మిని భూమిపైకి పంపుతుంది. ఇది భూమి చుట్టూ ఒక గొడుగులా ఆవరించి ఉండి, ఒక కవచంలా కాపాడుతుంది. ఇప్పుడు ఓజోను పొర మానవ తప్పిదాలకు కనుమరుగైపోతుంది.

అధిక ఇంధన వాడకం, మితిమీరిన రసాయనాలు ఉపయోగించడం, చెట్లు నరికివేయడం, వంటి అంశాలు ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి. ఈ ఓజోన్ పొర క్షీణత వల్ల మూలకణ మరియు పొలుసల కణ క్యాన్సర్లు, ప్రాణాంతక పుట్టకురుపు, కంటి శుక్లాలు వంటి రోగాల బారిన ప్రజలు పడే అవకాశం ఉంది. కాలుష్య కారకాల నుండి ఓజోన్‌ను రక్షించేందుకు ఐక్యరాజ్యసమితి కొన్ని ప్రణాళికలు రూపొందించింది. దానినే మాంట్రియల్ ప్రోటోకోల్ అంటారు.

ఇందులో సుమారు 100 రకాల రసాయనాల వాడకాన్ని 2030 నాటికి అభివృద్ధి చెందిన, 2040 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పూర్తిగా అరికట్టడమే లక్ష్యం. 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ ప్రోటోకోల్ పైన ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. ఆ రోజు గుర్తుగా ఐక్యరాజ్యసమితి 1994లో సెప్టెంబర్ 16వ తేదీని అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవం నిర్వహిస్తుంది.

కాగా 2050 నాటికి అంటార్కిటికా పైన ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం పూడుకుపోతుందని పరిశోధకులు చెపుతున్నారు. ఐతే అక్కడ పూడుకుపోయినా నిత్యం రసాయనాలను వదులుతున్న జనారణ్యం పైన పడదా అంటే మాత్రం నొసలు ఎగరేస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్యాన్ని అరికట్టగలిగితేనే ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు.

ఓజోన్ రక్షణే మన రక్షణ               

క్లోరోఫ్లోరో కార్బన్ల కాలుష్యానికి అమెరికా తదితర సంపన్న దేశాలదే ఎక్కువ బాధ్యత. కానీ అవి తమ బాధ్యతను అంగీకరించి దానిని తగ్గించేందుకు ముందుకు రావండంలేదు. తక్కువ కాలుష్యానికి కారణమైన దేశాలతో వంతుకు పోతున్నాయి. వాటి వైఖరివల్ల ఈ రంగంలో పోవలసినంత ముందుకు పోలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి.

భూమిని ఆవరించి కొన్ని వేల కిలోమీటర్ల వరకూ అనేక వాయువులు ఉన్నాయి. దీనినే వాతావరణం అంటారు. ఈ వాయువులలో ఆక్సిజన్‌, కార్బన్‌డైఆక్సైడ్‌, లాగానే ఓజోన్‌ ఒకటి.  

ఓజోన్‌ ఎలా ఏర్పడుతుంది?

వాస్తవానికి ఆక్సిజన్‌ పై అతినీలలోహిత కిరణాల చర్యవలన ఓజోన్‌ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతుంది.

ఈ ఓజోన్‌ అస్థిరమైన వాయువు. కనుక ఇది స్ట్రాటోస్ఫియర్‌లో మళ్ళీ అణుఆక్సిజన్‌గా విడిపోతుంది. అంచేత స్ట్రాటోస్ఫియర్‌లో సాధారణంగా ఓజోన్‌ ఉత్పత్తి, క్షీణతల మధ్య సమతుల్యం ఉంటుంది.

ఓజోన్‌ ఏ పొరల మధ్య ఉంటుంది?

ఓజోన్‌ వాతావరణంలోని దిగువస్తరం(పొర) అయిన ట్రోపోస్ఫియర్‌లోనూ, ఎగువ పొర అయిన స్ట్రాటోస్పియర్‌లోనూ ఉంటుంది. ట్రోపోస్ఫియర్‌లో ఏర్పడే ఓజోన్‌ మొక్కలకు, జంతువులకు హాని చేస్తుంది. కాబట్టి ఈ పొరలో ఏర్పడే ఓజోన్‌ను 'చెడు ఓజోన్‌' అంటారు. వాతావరణంలోని ఎగువస్తరం అయిన స్ట్రాటోస్ఫియర్‌లో ఏర్పడే ఓజోన్‌ భూమిచుట్టూ దళసరి పొరలా ఏర్పడుతుంది. ఈ పొర సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకుని భూమికి రక్షణ కవచంలా ఉంటుంది. అంచేత ఈ పొరలో ఉన్న ఓజోన్‌ను 'మంచి ఓజోన్‌' అంటారు.

అతినీలలోహిత కిరణాలు

సూర్యుని నుండి వెలువడే అనేక రకాల కిరణాలలో అతినీలలోహిత కిరణాలు ఒకటి. ఈ కిరణాలు ప్రాణాలకు అత్యంత హానికారకాలు. 380ఎన్‌ ఎం లకన్నా తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన వాటిని అతినీలలోహిత కిరణాలుగా పిలుస్తారు. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. అతినీలలోహిత సి కాంతి(100-280ఎన్‌ ఎం), అతినీలలోహిత బి కాంతి(280-320ఎన్‌ ఎం), అతినీలలోహిత ఎ కాంతి(320-380). ఈ మూడు రకాలలో సి, బి కాంతి చాలా హానికరం.

అతినీలలోహిత '' కాంతి కిరణాలు

వీటివల్ల జంతువులకు హానికన్నా మేలే ఎక్కువ. ఈ కాంతి జంతువుల దేహంపై ఉండే సూక్ష్మజీవులను నశించేటట్లు చేస్తుంది. అలాగే క్షీరదాల చర్మంలోఉన్న స్టిరాల్స్‌ను విటమిన్‌-డి గా మార్చడంలో సహాయపడుతుంది. చర్మక్యాన్సర్‌ వంటి నష్టాలుకూడా వీటివల్ల ఉన్నాయి.

అతినీలలోహిత 'బి' కాంతి కిరణాలు

ఈ కిరణాలు నేరుగా డిఎన్‌ఎ పైనే తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. డిఎన్‌ఎ మార్పుచెందడం వల్ల ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. అలాగే ప్రోటీన్ల అణువులలోని రసాయనక బంధాలను విడగొడతాయి. చర్మకణాలు దెబ్బతినడం, చర్మం ముడతలు పడడం, చర్మక్యాన్స్‌ర్‌కు దారితీసే అవకాశం కూడా ఉంది. మానవుని కంటిలోని కార్నియా ఈ కిరణాలను శోషించు కుంటాయి. దీని అధిక మోతాదువల్ల కార్నియా దెబ్బతిని స్లో బ్లైండ్‌నెస్‌, కాటరాక్ట్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఒక్కోసారి కార్నియాను శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

అతినీలలోహిత 'సి' కాంతి కిరణాలు

ఇవి ఎ, బి లకంటే ప్రమాదకరమైనవి. అయినప్పటికీ ఈ కిరణాలు ఓజోన్‌ పొర దాటి రాలేవు. ఓజోన్‌ పొర ఉన్నంత వరకూ భూమి మీది మానవులకు, జంతువులకు, మొక్కలకు, జీవరాశులకు ఎటువంటి ప్రమాదం ఉండదు.

సెప్టెంబర్‌-16న ఓజోన్‌ డే ఎందుకు?

అంటార్కిటికా ప్రాంతంలో వున్న ఓజోన్‌ పొరకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల చివరి వారం, అక్టోబర్‌ నెల మొదటి వారం మధ్య రంధ్రం ఏర్పడుతుంది. ఈ రెండు నెలల మధ్య కాలం సెప్టెంబర్‌-16 కాబట్టి ఈ రోజును ఓజోన్‌ డే గా జరుపుకుంటారు. దీని అర్థం, ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్‌-15 వరకు మొత్తం 22 రోజులలో అంటార్కిటికాలో ఉన్న ఓజోన్‌ క్షీణిస్తుంది.

సెప్టెంబర్‌-16 నుంచి అక్టోబర్‌ మొదటి వారానికి 22 రోజులు. క్షీణించిన ఓజోన్‌ పొర క్రమంగా బూడిదగా మారిపోతుంది.

ఓజోన్‌ పొర ఎందుకు క్షీణిస్తుంది?

వాతావరణంలో కార్బన్‌, హైడ్రోజన్‌, క్లోరిన్‌, ఫ్లోరిన్‌లలో ఉన్న వివిధ హేలోకార్బన్లు ఉంటాయి. వీటిని క్లోరోఫ్లోరోకార్బన్లు అనికూడా అంటారు. వీటివల్ల ఓజోన్‌ క్షీణతపెరిగి పొర సమతుల్యత దెబ్బతింటుంది. మోటారు వాహనాలు, విమానాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసి సిస్టమ్‌లు మొదలైనవి క్లోరోఫ్లోరో కార్బన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదకర వాయువులు వాతావరణంలోని పైనున్న స్ట్రాటోస్ఫియర్‌ వరకూ వ్యాపిస్తాయి. అక్కడ అతినీలలోహిత కిరణాల చర్య వల్ల క్లోరోఫ్లోరో కార్బన్‌ల నుంచి క్లోరిన్‌ పరమాణువులు విడుదలవుతాయి. ఈ పరమాణువులు ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఓజోన్‌ అణువులను విచ్ఛిన్నం చేసి అణు ఆక్సిజన్‌ ను విడుదలయ్యేలా చేస్తాయి.

O3

ఓజోన్‌ విచ్ఛిన్నత అనేది అంటార్కిటికా ప్రాంతంలో అధికంగా ఉంటుంది. అంచేత అక్కడి ఓజోన్‌ పొర మందం క్షీణించింది. దీనినే సామాన్యంగా ఓజోన్‌ రంధ్రం అని అంటారు. ఈ క్షీణత 2007 సంవత్సరంలో అంటార్కిటికా ప్రాంతంలో 2.5 కోట్ల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, 2008 నాటికి 2.7 కోట్ల చదరపు కిలోమీటర్లకు వ్యాపించింది.

నియంత్రణ చర్యలు

మన జీవ ప్రపంచ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రకృతి సంరక్షణ ముఖ్యం. 'బతుకు-బతకనివ్వు' అనే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతి సంరక్షణ అన్ని దేశాల బాధ్యత అని గ్రహించారు. ఓజోన్‌ పొర క్షీణత వల్ల కలిగే ధుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారణమైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీనిని 1987లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ పేరులో అమోదించగా అది 1989లో అమలులోని వచ్చింది. తర్వాత ఓజోన్‌ పొర క్షీణతను నివారించడానికి అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు విడివిడిగా క్లోరోఫ్లోరో కార్బన్లు, ఓజోన్‌ క్షీణతను తగ్గించే మార్గదర్శకాలు, చర్యలు చేపట్టారు.

======================

WORLD OZONE DAY THEMES: 👇

2024: “Montreal Protocol: Advancing Climate Actions”

2023: "Montreal Protocol: Fixing the Ozone Layer and Reducing Climate Change".

2022: 'Global Cooperation Protecting Life on Earth'

2021: 'Montreal Protocol – Keeping us, our food, and vaccines cool’

2020: ‘Ozone for life’

2019: ‘32 years and healing’

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags