Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam nerchukundam IRI 12th september programme details

Vindam nerchukundam IRI 12th september programme details


"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 12-09-2019 రేడియో పాఠం
విషయం : గణితం
పాఠం పేరు : సమాన భాగాలు-సమాన సమూహాలు
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
5. బోధనా లక్ష్యాలు :- విద్యార్థినీ విద్యార్థులు
ఇచ్చిన వస్తువులను సమాన సమూహాలుగా విభజించగలుగుతారు.
భాగించడం ద్వారా సులభంగా సమాన సమూహాలుగా మార్చవచ్చని అవగాహన చేసుకుంటారు.
విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషంల గురించి అవగాహన చేసుకుంటారు.
భాగహారం అంటే ఆవర్తన వ్యవకలనం అనీ, గుణకారం ద్వారా భాగహారాన్ని సరిచూసుకోవచ్చని తెలుసుకుంటారు.
నిత్యజీవిత సంఘటనలకు భాగహారాన్ని అన్వయించుకుంటారు.
ఆట, పాటల ద్వారా శారీరక, మానసికోల్లాసాలు పెంపొందించుకుంటారు.
6. బోధనాభ్యసన సామాగ్రి :
పాఠ్యపుస్తకం,
పాఠ్యపుస్తకం 62 వ పేజీలోని ' చిత్రం గీచిన చార్డ్
63 వ పేజీలోని ' చిత్రం గీచిన చార్ట్
పాట రాసి ఉంచిన చార్ట్


7. ప్రసార పూర్వక కృత్యాలు :
(అ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటఆడించే విధానం పై అవగాహన కలిగియుండాలి.
ఆట:
తరగతి గదిలో పిల్లలందరూ నిలబడగలిగే విధంగా పెద్ద వృత్తం గీయాలి.
మ్యూజిక్ వినిపించినంత సేపు పిల్లలందరూ వృత్తం చుట్టూ పరుగెత్తాలి.
మ్యూజిక్ ఆగిపోగానే పిల్లలు తిరగడం ఆపాలి.
రేడియో టీచర్ సూచించిన విధంగా పిల్లలందరూ సమూహాలుగా ఏర్పడాలి. చెప్పిన సంఖ్య ప్రకారం వరుసలలో నిలబడాలి.
(ఆ) కార్యక్రమంలో నిర్వహించే కృత్యాలపై అవగాహన కలిగియుండాలి. కృత్యం 1;- 9 బంతులను ఇద్దరికీ సమానంగా పంచినప్పుడు విభాజకం, విభాజ్వం,భాగఫలం, శేషం ఎంతెంతో తరగతిలోని పిల్లలచే చెప్పించాలి.
24 కొవ్వొత్తులను 8 ప్యాకెట్లలో ఉంచితే ఒక్కొక్క ప్యాకెట్లో 3 ఉంటాయి. దీనిని గుణకార రూపంలో పిల్లలచే చెప్పించాలి.
కృత్యం 2- తరగతిలోని పిల్లలందరినీ రెండు సమూహాలుగా విభజించాలి.
 62 వ పేజీలోని ' చిత్రం గీచిన చార్డును ప్రదర్శించాలి.
 ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఆ చిత్రంలోని ఏమిటి ? ఎన్ని ఉన్నాయి? చిత్రంలో ఎన్ని అడ్డువరుసలున్నాయి? ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉన్నాయి? పిల్లలచే చెప్పించాలి.
పైన చూపించిన చిత్రాన్ని భాగహార రూపంలో పిల్లలచే చేయించాలి.
 63వ పేజీలోని " చిత్రం గీసిన చార్డును ప్రదర్శించాలి.
 ఒక విద్యార్థిచే అవేమిటి? ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
 మరొక విద్యార్థి చేత అడ్డువరుసలెన్నో చెప్పించాలి.
 మరొక విద్యార్థి చేత అడ్డువరుసలో ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
 పైన చూపించిన చార్జులోని చిత్రాన్ని భాగహార రూపంలో రాయించాలి.
 మరొక విద్యార్థి చేత ఆ భాగహారాన్ని గుణకారం ద్వారా సరిచూడమనాలి.
 రేడియో టీచర్ సూచించిన భాగహారం చేయించి, విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషాలను పిల్లలచే చెప్పించాలి.
కృత్యం 3:- ఆటలో భాగంగా రేడియో టీచర్ సూచనలను అనుగుణంగా పిల్లలందరూ వరుసకు నలుగురు చొప్పున, 2 వరుసలోని సమానంగా, వరుసలో ఆరుగురు చొప్పున, 4 వరుసలలో సమానంగా ఇలా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా నిలబడాలి.
ఇ. కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను స్పష్టంగా చార్టుపై రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.
పల్లవి: బాలల్లారా మనమంతా - భాగహారము నేర్వాలి
సమానంగా పంచాలంటే - భాగహారము చెయ్యాలి !! బాలల్లారా !!
చరణం: భాగించాల్సిన సంఖ్యను మనము - విభాజ్యమని అంటాము
ఏ సంఖ్యతో మనము భాగిస్తాము - విభాజకమని దాన్నంటాము
భాగించగ వచ్చిన ఫలితాన్ని - భాగఫలమని అంటాము
మిగిలిపోయిన మొత్తాన్ని - శేషం అని మనమంటాము !! బాలల్లారా !!
చరణం :- పొలాలనైనా స్థలాలనైనా - సమూహంలో పిల్లలనైనా
పండ్లూ ఫలాలు వస్తువులైనా - పంచవలసిన సొమ్మేం లైనా
ఎక్కువ తక్కువ లేకుండా - సమభాగాలుగా చేయాలంటే
భాగహారము చెయ్యాలి - గుణకారంతో సరిచూడాలి !! బాలల్లారా !!

Previous
Next Post »
0 Komentar

Google Tags