Vindam nerchukundam IRI 16th september programme details
"విందాం - నేర్చుకుందాం"
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 16.09.2019
★ విషయము : పరిసరాల విజ్ఞానం
★ పాఠం పేరు : "శక్తి"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
✳ *శక్తి*
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• ఇంధనం అంటే ఏమిటో తెలుసుకొంటారు.
• సౌరశక్తిని గురించి, సౌరశక్తి తో పనిచేసే పరికరాలను గురించి తెలుసు కొంటారు.
• తరిగి పోయే, తరిగిపోని శక్తి వనరులను గురించి తెలుసుకొంటారు.
• విద్యుత్ ను పొదుపు చేయాలని తెలుసుకొంటారు.
• మనం శక్తి వపరులను ఎందుకు కాపాడాలో తెలుసుకొంటారు.
★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• పదాలు వ్రాయుటకు చీటీలు
• డబ్బా
• తరిగిపోని శక్తి వనరుల చిత్రాలు
• తరిగిపోయే శక్తి వనరుల చిత్రాలు
• సుద్దముక్క
• పాఠ్యపుస్తకం
• పాటను రాసిన చార్టు.
పై బోధనాభ్యసన సామాగ్రిని సిద్ధంగా ఉంచుకొని రేడియో టీచర్ సూచనల కనుగుణంగా వినియోగించాలి.
★★★★★★★★
✡ *బోధనాభ్యసస కృత్యాలు :*
*ప్రసార పూర్వక కృత్యాలు :*
*కార్యక్రమంలో నిర్వహించబోయే “ఆట” ఆడించే విధానంపై అవగాహన కలిగియుండాలి.*
*ఆట:*
*ఆట కొరకు క్రింది చిత్రాలు సిద్దంగా ఉంచవలెను*
1. రైలు
2 ఆటో
3. సౌరశక్తితో వెలిగే దీపం
4. పవన విద్యుత్ కొరకు తిరిగే పెద్ద ఫ్యాన్ల చిత్రం
5, జల విద్యుత్ ఉత్పత్తి అయ్యేచిత్రం
6. పైకిల్ డైనమో (లేదా) థర్మల్ విద్యుత్ చిత్రం
పై చిత్రాలు అందుబాటులో లేకపోతె పాఠ్య పుస్తకం లో ఉన్న చిత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
• తరగతి లోని మొత్తం విద్యార్థులను 2 గ్రూపులు చేసి ఆ గ్రూపులకు A, B అనీ పేర్లు పెట్టి తరగతి మధ్యలో ఒక గ్రూపుకు ఎదురుగా మరో గ్రూపును కూర్చోబెట్టాలి.
• మొదటి గ్రూపు వారికి క్రింది చిత్రాలు ఇవ్వాలి.
1. రైలు 2. సౌరశక్తి ద్వారా వెలిగే విద్యుత్ దీపం 3. జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే చిత్రం.
• రెండవ గ్రూపు వారికి క్రింది చిత్రాలు ఇవ్వాలి.
1. ఆటో 2. జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే చిత్రం 3. దైవమా (లేదా) థర్మల్ విద్యుల్ చిత్రం
• మొదటి గ్రూపు వారు వారి దగ్గరి ఉన్న చిత్రాన్ని చూపించగానే రెండవ గ్రూపువారు ఆ చిత్రంలో వాహనం వుంటే ఆ వాహనం ఏ ఇంధనంతో పని చేస్తుందో చెప్పాలి. చూపించిన చిత్రంలో వాహనం కాకుండా విద్యుత్ తయారీకి సంబంధించిన చిత్రం ఉంటే ఆ విద్యుత్ ఎలా తయారవుతుందో చెప్పాలి.
• రెండవ గ్రూపువారు కూడా వారి దగ్గర చిత్రాన్ని చూపించగానే మొదటి గ్రూపు వారు కూడా పై విధంగా సమాధానం చెప్పాలి.
• రెండు గ్రూపుల వారు ఒకసారి చూపించిన చిత్రాన్ని మరలా చూపించకూడదు.
• ఈ ఆటలో ఎక్కువ జవాబులు చెప్పిన గ్రూపును అభినందించండి.
★★★★★★★★
✡ *కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.*
*కృత్యము :*
• చీటీలలో క్రింది విషయాలను రాయాలి
1. బొగ్గు
2. వంట చెరుకు
3. గాలి
4. నీరు
5. పెట్రోల్
6. సౌరశక్తి
• రాసిన చీటీలను నల్లబల్ల దగ్గర డబ్బాలో ఉంచాలి
• తరగతి లోని విద్యార్థులందరిని నల్లబల్ల కెదురుగా కూర్చోబెట్టాలి.
• ఉపాధ్యాయులు నల్లబల్లను రెండు భాగాలుగా విభజించి ఒకవైపు 'తరిగిపోయే శక్తి వనరులు' అని రెండవ వైపు తరిగిపోని శక్తి వనరులు' అని రాయాలి.
• తరగతి ఉపాధ్యాయులు రేడియో టీచర్ సూచనల ప్రకారం ఒక్కో విద్యార్థిని పిలిచి ఆ డబ్బాలోని చీటీని తీసి దానిలో ఉన్నది తరిగిపోయే శక్తి వనరులు ఉంటే నల్లబల్లపై తరిగిపోయే శక్తి వనరుల కింద, ఆ చీటీలో తరిగిపోని శక్తి వనరులు ఉంటే నల్లబల్లపై తరిగిపోని శక్తి వనరుల కింద విద్యార్థిచే రాయించాలి.
• డబ్బాలోని చీటీలు అయిపోయేంతవరకు ఈ కృత్యాన్ని విద్యార్థులచే నిర్వహించాలి.
★★★★★★★★
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼 *పాట (పాఠం పై గేయం):*
🎤 *పల్లవి :*
వనరులు ఎన్నో రకాలు
శక్తి వనరులు ఎన్నెన్నో రకాలు
పెట్రోల్, డీజిల్, గాలి, నీరు
తరగని, తరిగే శక్తి వనరులు //వనరులు//
🎻 *చరణం 1:*
సూర్యుని వలన వచ్చే ఎండ
సౌర విద్యుత్ ని ఇస్తుంది
వీచే గాలి శక్తి వలన
పవన విద్యుత్తునిస్తుంది. //వనరులు//
🎻 *చరణం 2:*
భూగర్భంలో ఉండే బొగ్గు
ధర్మల్ విద్యుతినిస్తుంది
రిజర్వాయర్ లో ఉండే నీరు
జల విద్యుతను ఇస్తుంది //వనరులు//
★★★★★★★★
✡ పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
0 Komentar