Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam nerchukundam IRI 17th-21th september programme details

Vindam nerchukundam IRI 17th-21th september programme details


"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 20-09-2019 నాటి రేడియో పాఠం
విషయం : గణితం
పాఠం పేరు : "తీసివేత (వ్యవకలనం)"
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, ఆట, పాట...

Download...20th September IRI Programme details


"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 18-09-2019 నాటి రేడియో పాఠం
  విషయం : తెలుగు
పాఠం పేరు : "తొలకరి చిరుజల్లులు"
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, ఆట, పాట...
తొలకరి చిరుజల్లులు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
సంభాషణల ద్వారా పాఠ్యాంశాన్ని అవగాహన పరచడం
గేయాన్ని రాగ యుక్తంగా పాడించడం, అభినయింప చేయడం.
పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడం .
విన్న, చదివిన అంశంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం
పాఠ్యసారాంశాన్ని సొంత మాటల్లో చెప్పించడం, రాయించడం
పిల్లలు రెండు, మూడు అక్షర పదాలు చెప్పగలుగుతారు. అచ్చులు, హల్లులను గుర్తించి,చెప్పగలుగుతారు.
పాటద్వారా పాఠ్యసారాంశాన్ని అర్థంచేసుకొని, పాటను సొంతంగా పాడుతారు.
బోధనాభ్యసన సామగ్రి:
పాఠ్య పుస్తకాలు
తెల్లకాగితాలు, పెన్నులు, పెన్సిల్లు
నోటు పుస్తకాలు
• 9 తెల్లకాగితపు చీటీల పై అంటే మొదటి 3 చీటీలపై ఓ రెండు అక్షర పదాలు' అని తరువాత 3చీటీ లపై మూడు అక్షర పదాలు' తరువాత 3 చీటీలపై నాలుగు అక్షర పదాలు' అని రాయాలి. ఆటలో ఉపయోగించాలి.
• 10 కాగితపు చీటీలు/తీసుకోవాలి మొదటి 5 చీటీలపై అచ్చు అక్షరాలు ఒక్కొక్క చీటిపై ఒక్కొక్క అక్షరం రాయాలి. మిగతా 5 చీటీలపై హల్లు అక్షరాలు ఒక్కొక్క చీటిపై ఒక్కొక్క హల్లు అక్షరం రాయాలి ఆటలో ఉపయోగించాలి.
పాట రాసి ఉంచిన చార్టు.
బోధనాభ్యసస కృత్యాలు :
ప్రసార పూర్వక కృత్యాలు :
కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటఆడించే విధానంపై అవగాహన కలిగియుండాలి.
ఆట:
పరిగెడుదాం - పదాలు  చెబుదాం
రేడియో టీచర్ సూచనలు పాటిస్తూ, ఆటను ఆడించాలి
పిల్లలను వృత్తాకారంగా నిల్చోమనాలి.
రేడియో టీచర్ సూచనల ప్రకారం చేయాలి.
ఉదా : మ్యూజిక్ వచ్చినపుడు -ముందుకు దూకండి అంటే ముందుకు దూకాలి వెనకకుదూకండి అంటే వెనకకు దూకాలి.
మ్యూజిక్ వచ్చినంత సేపు ఉన్న చోటే పరిగెత్తుతున్నట్లు నటించాలి.
మ్యూజిక్ ఆగిపోగానే ఆపివేయాలి. టీచర్ చెప్పిన విద్యార్థి వృత్తంలో ఉన్న చీటి తీసి, అందులో అడిగిన విధంగా సమాధానం చెప్పాలి.
ఉదా: 1. పదాలు చెప్పడం 2. అచ్చులను, హల్లులను గుర్తించడం
కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.
Segment 4
కృత్యము :1:
సంభాషణల అవగాహనపై - పరిశీలన
* రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు, తరగతిలోని విద్యార్థులతో సమాధానం చెప్పించాలి. లత,” రాజులు చెప్పే సమాధానాలను వినేలా చూడాలి.
కృత్యము :2:
గేయ పంక్తులను చదవడం- ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం.
* పాఠ్యపుస్తకంలో 2 వ పేజిలో గల గేయంలోని మొదటి మూడు భాగాలను పిల్లలందరూచదివేలా చూడాలి.
* రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులతో సమాధానాలు చెప్పించాలి
కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
 పాట (పాఠం పై గేయం):
పల్లవి :
కిలకిల మను పిల్లలం!
తొలకరి చిరుజల్లులం!
అల్లరితో ఎల్లరినీ
అలరించే పిల్లలం!  //కిల కిల మను//
 చరణం 1:
తెలుగు తల్లి తోటలోని
వెలుగు లీను పువ్వులం
భారతి చిరు పెదవులపై
పరవశించు నవ్వులం  //కిల కిల మను//
 చరణం 2:
భరతమాత హారంలో
మెరియుచున్న రవ్వలం
రత్నగర్భపదములపై
రవళించే మువ్వలం  //కిల కిల మను//
చరణం 3:
మంచితనం మనసులలో
పంచి పెట్టు గువ్వలం
భారతమ్మ బొమ్మరిండ్ల
పాలు పెరుగు బువ్వలం  //కిల కిల మను//
పాట ప్రసార సమయంలో
మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 17-09-2019 నాటి రేడియో పాఠం
విషయం : గణితం
పాఠం పేరు : "సమాన భాగాలు-సమాన సమూహాలు"
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, పూర్వకృత్యాలు, ఆట, పాట...
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
ఇచ్చిన వస్తువులను సమాన సమూహాలుగా విభజించగలుగుతారు.
భాగించడం ద్వారా సులభంగా సమాన సమూహాలుగా మార్చవచ్చని అవగాహన చేసుకుంటారు.
విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషంల గురించి అవగాహన చేసుకుంటారు.
భాగహారం అంటే ఆవర్తన వ్యవకలనం అనీ  గుణకారం ద్వారా భాగహారాన్ని సరిచూసుకోవచ్చని తెలుసుకుంటారు.
నిత్యజీవిత సంఘటనలకు భాగహరాన్ని అన్వయించుకుంటారు.
ఆట, పాటల ద్వారా శారీరక, మానసికోల్లాసాలు పెంపొందించుకుంటారు.
బోధనాభ్యసన సామగ్రి:
పాఠ్యపుస్తకం,
పాఠ్యపుస్తకం 62 వ పేజీలోని చిత్రం గీచిన చార్ట్.
• 63 వ పేజీలోని చిత్రం గీచిన చార్ట్.
పాట రాసి ఉంచిన చార్ట్.
బోధనాభ్యసస కృత్యాలు :
ప్రసార పూర్వక కృత్యాలు :
కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటఆడించే విధానంపై అవగాహన కలిగియుండాలి.
ఆట:
తరగతి గదిలో పిల్లలందరూ నిలబడగలిగే విధంగా పెద్ద వృత్తం గీయాలి.
మ్యూజిక్ వినిపించినంత సేపు పిల్లలందరూ వృత్తం చుట్టూ పరుగెత్తాలి.
మ్యూజిక్ ఆగిపోగానే పిల్లలు తిరగడం ఆపాలి.
రేడియో టీచర్ సూచించిన విధంగా పిల్లలందరూ సమూహాలుగా ఏర్పడాలి. చెప్పిన సంఖ్య ప్రకారం వరుసలలో నిలబడాలి.
కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.
కృత్యము :1:
• 9 బంతులను ఇద్దరికి సమానంగా పంచినప్పుడు విభాజకం, విభాజ్వం, భాగఫలం, శేషం ఎంతెంతో తరగతిలోని పిల్లలచే
చెప్పించాలి.
• 24 కొవ్వొత్తులను 8 ప్యాకెట్లలో ఉంచితే ఒక్కొక్క ప్యాకెట్లో 3 ఉంటాయి. దీనిని గుణకార రూపంలో పిల్లలచే చెప్పించాలి.
కృత్యము :2:
తరగతిలోని పిల్లలందరినీ రెండు సమూహాలుగా విభజించాలి.
• 62 వ పేజీలోని "అ" చిత్రం గీచిన చార్టును ప్రదర్శించాలి.
ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఆ చిత్రంలోని ఏమిటి ? ఎన్ని ఉన్నాయి? చిత్రంలో ఎన్ని అడ్డువరుసలున్నాయి ఒక్కొక్క
వరుసలో ఎన్ని ఉన్నాయి? పిల్లలచే చెప్పించాలి.
పైన చూపించిన చిత్రాన్ని భాగహార రూపంలో పిల్లలచే చేయించాలి.
• 63వ పేజీలోని చిత్రం గీసిన చార్డును ప్రదర్శించాలి.
ఒక విద్యార్థిచే అవేమిటి? ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
మరొక విద్యార్థి చేత అడ్డువరుసలెన్నొ చెప్పించాలి.
మరొక విద్యార్థి చేత అడ్డువరుసలో ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
పైన చూపించిన చార్టులోని చిత్రాన్ని భాగహార రూపంలో రాయించాలి.
మరొక విద్యార్థి చేత ఆ భాగహారాన్ని గుణకారం ద్వారా సరిచూడమనాలి.
రేడియో టీచర్ సూచించిన భాగహారం చేయించి, విభాజ్యం, విభాజకం, భాగఫలం,శేషాలను పిల్లలచే చెప్పించాలి.
కృత్యము :3:
ఆటలో భాగంగా రేడియో టీచర్ సూచనలను అనుగుణంగా పిల్లలందరూ వరుసకు నలుగురు చొప్పున, 2 వరుసలోని సమానంగా, వరుసలో ఆరుగురు చొప్పున, 4 వరుసలలో సమానంగా ఇలా ఒక్కొక్కసారి ఒక్కోవిధంగా నిలబడాలి.
పాట (పాఠం పై గేయం):
పల్లవి :
బాలల్లారా మనమంతా - భాగహారము నేర్వాలి
సమానంగా పంచాలంటే - భాగహారము చెయ్యాలి  //బాలల్లారా //
 చరణం 1:
భాగించాల్సిన సంఖ్యను మనము - విభాజ్యమని అంటాము
ఏ సంఖ్యతో మనము భాగిస్తాము - విభాజకమని దాన్నంటాము
భాగించగ వచ్చిన ఫలితాన్ని - భాగఫలమని అంటాము
మిగిలిపోయిన మొత్తాన్ని - శేషం అని మనమంటాము   //బాలల్లారా //
చరణం 2:
పొలాలనైనా స్థలాలనైనా - సమూహంలో పిల్లలనైనా
పండ్లూ ఫలాలు వస్తువులైనా - పంచవలసిన సొమ్మెంతైనా
ఎక్కువ తక్కువ లేకుండా - సమభాగాలుగా చేయాలంటే
భాగహారము చెయ్యాలి - గుణకారంతో సరిచూడాలి  //బాలల్లారా /
పాట ప్రసార సమయంలో
మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
Previous
Next Post »

1 comment

Google Tags