ఏపీ ప్రభుత్వ పధకాలు సరాసరి లబ్దిదారుడి ఇంటికి చేర్చే విధంగా ప్రవేశపెట్టిన విధానంలో భాగంగా వాలంటీర్ల నియామకం జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక నియామకం పూర్తి అయినప్పటికి, కొన్ని కారణాలతో ఖాళీగా ఉన్న లేక ఇతర అవసరాల కోసం మరికొన్ని నియామకాలు ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే తాజాగా విడుదలైన 30,078 గ్రామ, కార్పోరేషన్ & మున్సిపాలిటీలలోని వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకి 10 వ తరగతి అర్హత ఉండటం గమనార్హం. నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
పోస్టుల వివరాలు : గ్రామ, వార్డ్ వాలంటీర్లు
పోస్టుల సంఖ్య : 30,078
అర్హత : 10th పాస్
వయసు : 01-11-2019 నాటికి 18 నుంచీ 35 ఏళ్ళ మధ్య ఉన్న వారు అర్హులు
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01-11-2019
దరఖాస్తులు చివరితేదీ : 10-11-2019
ఇంటర్వ్యూ : 16-11-2019 to 20-11-2019
ఎంపిక అయిన వారికి కాల్ లెటర్లు ఇచ్చే తేదీ : 22-11-2019
శిక్షణ : 29-11-2019
ఎంపిక అభ్యర్ధుల నియామక తేదీ : 01-12-2019
Panchayat Raj and Rural Development Department-Positioning of Volunteers @ one per around 50 households in the State to ensure effective implementation of Government Programmes/ Schemes
'గ్రామవాలంటీర్'
పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ GO జారీ
*రాష్ట్రవ్యాప్తంగా
9,674 పోస్టుల భర్తీ
*నవంబరు 1
నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
*డిసెంబరు 1
నుంచి విధుల నిర్వహణ
ఏపీలోని
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు వినిపించింది. గతంలో నియామకాలు చేట్టిన
గ్రామవాలంటీర్ పోస్టులకు సంబంధించి.. పలు కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ
కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
షెడ్యూలు..
జిల్లాల వారిగా ఖాళీల
వివరాలు ఇలా ఉన్నాయి...
శ్రీకాకుళం: 200, విజయనగరం : 823, విశాఖపట్నం: 370, పశ్చిమ గోదావరి: 590, తూర్పు గోదావరి: 1,861, కృష్ణా: 453, గుంటూరు: 919, ప్రకాశం: 592,
నెల్లూరు: 340, చిత్తూరు: 678, కడప: 891, అనంతపురం: 955, కర్నూలు:
976
మొత్తం 9,648
0 Komentar