Global hand washing day
October 15 వతేదీన ప్రతి పాఠశాలలో Global Hand Washing Day తప్పనిసరిగా నిర్వహించి నివేదిక అందజేయాలి.
👉 పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
బాలల హక్కులను కాపాడటానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలి.
15/10/2019 తేదీన నిర్వహణ అంశాలు
➤ 9:30_10:00 - స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ
➤ 10:00-1100 - బాలల సంఘాలు ఏర్పాటు చైతన్యపరచుట,
➤ 11:00-12:00 - చేతుల పరిశుభ్రత పై వీధి ర్యా లి
➤ 12:00-12:30 - చేతుల పరిశుభ్రమైన ఉపాధ్యా యుల టెక్నిక్స్
➤ 12:30-01:00 - విద్యార్థుల చేతుల పరిశుభ్రత.
పై అంశాలపై నివేదిక ఇవ్వాలి.
శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు పాఠశాల స్థాయిలో మిగిలిన ఉపాధ్యాయులకూ మరియు విద్యార్థులకు WASH (Water Sanitation Hygiene) గురించి అవగాహన కల్పించాలి.
స్వచ్చ భారత్ ప్రతిజ్ఞ
మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్ర్యమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను.
➤ నేను పరిశభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రతకోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను.
➤ ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను.
➤ నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరేవారిని అశుభ్రం చేయనివ్వరు.
➤ అందరికంటే ముందు నేను, నా కుటుంబాన్ని నా పరిసరాలను, నాకార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను.
➤ ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక పోవటమే అని నేను నమ్ముతాను.
➤ ఈ విషయంలో నేను, వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి "స్వచ్ఛ ఆంధ్ర మిషన్" తద్వారా " స్వచ్ఛభారత్ మిషన్" కోసం ప్రచారం చేస్తాను.
➤ నేను ఈరోజు నుండి నాతోపాటు 100 మందితో నాలాగా పరిశుభ్రతకోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
➤ ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను.
Click here to download...Hand hygiene hand book
Click here to download...Hand hygiene hand book
0 Komentar