India Post Gramin Dak Sevak Recruitment 2019
ఆంధ్రప్రదేశ్ (2707 posts), తెలంగాణ (970 posts), చత్తీస్‌గఢ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 5,476 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఇండియా పోస్ట్ చేపడుతున్న అతిపెద్ద నియామక ప్రక్రియ ఇది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 15న, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://indiapost.gov.in లేదా http://appost.in/gdsonline వెబ్‌సైట్‌లో 2019 అక్టోబర్ 15 నుంచి 2019 నవంబర్ 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ కోసం పేరు (10వ తరగతి మార్క్స్ మెమోలో ఉన్న పేరు), తండ్రి పేరు, మొబైల్ నెంబర్ (ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఒకే ఫోన్ నెంబర్ ఉపయోగించాలి.) , పుట్టిన తేదీ మొII లైన వివరాలు నమోదు చేయాలి. ఒక అభ్యర్థి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర సర్కిళ్లలో కూడా దరఖాస్తు చేస్తున్నట్టైతే అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో లేదా http://appost.in/gdsonline వెబ్‌సైట్‌లో కూడా ఫీజు చెల్లించొచ్చు. ఫీజు చెల్లించే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ వెల్లడించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2019 అక్టోబర్ 22 నుంచి 2019 నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఫీజు పేమెంట్ పూర్తైన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వెబ్‌సైట్‌లో Apply Online లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లై చేసిన సర్కిల్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సూచించిన ఫార్మాట్, సైజ్‌లోనే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
Click here for Andhrapradesh Notification
Click here for Telangana Notification
Click here for Andhrapradesh Notification
Click here for Telangana Notification
0 Komentar