Let's Celebrate the Diwali Festival Safely
దీపావళి
బాణసంచాను కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
=====================
►దుకాణం నుండి తెచ్చిన బాణాసంచాను ఇంట్లో ఓ కార్డ్‌బోర్డ్ బాక్స్ వంటి దాన్లో
పెట్టాలి. ఈ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి.
►బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా
ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.
►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌ల
వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు.
►మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో
పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది.
►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు.
►బాణాసంచాను కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా మీ
చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది.
►వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. వదులైన దుస్తులైతే అవి
వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.
►బాణాసంచాను ఒక సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు
కాల్చడం,
పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా
కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.
►కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.
►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. గాయానికి తడి టవల్‌ను
చుట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.
►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి.
►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట
తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
►గాయాన్ని కడగడానికి ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ఎట్టి
పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.
►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే
వేడిమి,
మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే
అవకాశం ఉంటుంది. అలాగే సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి
రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.
►బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.
►డైరెక్ట్ గా మంట కంటికి తగిలితే కార్నియా దెబ్బతింటే కంటికి శాశ్వత నష్టం
సంభవించే అవకాశం ఉంటుంది.
=====================
పై
జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ ను సురక్షితంగా జరుపుకుందాం.
=====================
« Prev Post
Next Post »
0 Komentar