Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

October 12 - The day when the Right to Information Act comes into force

October 12 - The day when the Right to Information Act comes into force

అక్టోబర్ 12 -  సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు
"సమాచార హక్కు చట్టం" ప్రభుత్వం చేసిన ప్రతి పనిని తెలుసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన హక్కు ఇది.
      సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీ నుంచి అయినా సమాచారం కోరవచ్చు. (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) సమాచారం కోసం కోరడమెలాగో తెలుసుకోండి.
దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి. వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి.
మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి.
సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) / పౌర సమాచార అధికారి (పి ఐ ఓ) పేరు,
కార్యాలయం చిరునామా
విషయం : దరఖాస్తు-సమాచార చట్టం-2005 సెక్షన్ 6(1) ప్రకారం పబ్లిక్ అథారిటీనుంచి మీకు కావలసిన సమాచారం వివరాలు
దరఖాస్తుదారు పేరు
తండ్రి / భర్త పేరు
కేటగిరి: ఎస్సీ / ఎన్టీ/ ఓబిసి
దరఖాస్తు రుసుము
మీరు పేద (బిపిఎల్) కుటుంబానికి చెందినవారా? అవును | కాదు
మీ పోస్టల్ చిరునామా,
మొబైల్ ఫోన్ నంబరు,
ఇ-మెయిల్ ఐడి (అయితే, ఇ-మెయిల్ ఐడి ని పేర్కొనడం తప్పనిసరి కాదు)
తేదీ,
ఊరు
దరఖాస్తుదారు సంతకం
జతపరుస్తున్న పత్రాల జాబితా
దరఖాస్తు దాఖలుచేసే ముందు సహాయ పౌర సమాచార అధికారి/ పౌర సమాచార అధికారి పేరు, నిర్దేశించిన సుంకం, చెల్లించవలసిన తీరు సక్రమంగా వున్నది లేనిది సరిచూసుకోండి.
సమాచార హక్కు (ఆర్టిఐ) చట్టం కింద, సమాచారం పొందడానికి దరఖాస్తు రుసుం చెల్లించవలసి వుంటుంది. అయితే, ఎస్సి/ ఎస్టి / బిపిఎల్ కుటుంబాలకు చెందినవారికి సుంకంనుంచి మినహాయింపు వుంది.
సుంకం మినహాయింపు కోరేవారు ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతచేయవలసి వుంటుంది.
దరఖాస్తును స్వయంగా, లేదా పోస్టు ద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారానైనా పంపవచ్చు. పోస్టుద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్డ్ పోస్టుద్వారానే పంపాలి. కొరియర్ ద్వారా పంపవద్దు.
దరఖాస్తు పత్రాలకు (అంటే, దరఖాస్తు ఫారము, సుంకం చెల్లింపు రసీదు, స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించినట్టు రసీదు) రెండు జిరాక్స్ కాపీలు తీయించుకుని తర్వాతి అవసరాలకు వీలుగా మీ వద్ద వుంచుకోండి.
మీరు స్వయంగా దరఖాస్తు అందజేస్తుంటే, ఆ కార్యాలయం నుంచి రసీదు తీసుకోండి. ఆ రసీదుపై తేదీ, ఆ కార్యాలయం ముద్ర స్పష్టంగా వుండేలా జాగ్రత్త వహించండి.
దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపదలచుకుంటే, దానిని రిజిస్టర్డ్ పోస్టులో పంపి ఆ రసీదును భద్రంగా వుంచుకోండి. ఆ దరఖాస్తు పౌర సమాచార అధికారికి అందిన తేదీనుంచి, సమాచారం అందజేయడానికి గడువును లెక్కించడం జరుగుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags