పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు.
చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు.
ఇతడు 1881 అక్టోబరు 25 మలగ, స్పెయిన్ లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన
చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు. అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక
శైలులను, మాధ్యమాలను అనుసరించినది.
పికాసో చిత్రించిన చిత్రాలలో
అత్యంత ప్రసిద్ధి చెందినవి:
*1901 లో చిత్రించిన
"తల్లిప్రేమ'.
*1937 ఏప్రియల్లో ప్రాంకో,
జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో
నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica)
ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన
ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో
చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల
ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి
అందించాడు పికాసో.
లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles
d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.
*1962 లో అతడు లెనిన్ శాంతి
బహుమతిని అందుకొన్నాడు.
*పికాసో 1973 ఏప్రిల్ 8 (వయసు 91) న
మౌగిన్స్ , ఫ్రాన్స్ లో మరణించాడు.
Guernica (Picasso)
పికాసో గీసిన చిత్రాలకు 110 మిలియన్ డాలర్ల ధర లభించింది. ఈ చిత్రం 20 ఏళ్లుగా
ఓ హోటల్ గదిలో ఉన్నాయి. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్
సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ
హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి.
1938లో వేసిన ‘వుమెన్ ఇన్
ఏ రెడ్-ఆరెంజ్ ’చిత్రానికి 40.5 మిలియన్ డాలర్ల ధర
పలికింది. వాస్తవానికి అంచనావేసినదాని కంటే 10 మిలియన్
డాలర్లు అదనపు ధర లభించింది. మిగిలిన
వాటిల్లో ఒక దానికి 24.4 మిలియన్ డాలర్లు, 9.5 మిలియన్ డాలర్లు, 2.1 మిలియన్ డాలర్లు చొప్పున ధర
లభించింది. ఈ చిత్రాల కొనుగోలుదారుల పేర్లను మాత్రం ఆక్షన్ సంస్థ బహిర్గతం
చేయలేదు.
Eleven Pablo Picasso artworks have been sold for a combined $109 million in a Las Vegas auction coinciding with the artist’s 140th birthday. (Via @AP) https://t.co/bKVyiGkrGV
— Bloomberg (@business) October 25, 2021
0 Komentar