Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Rashtriya Ekta Diwas (National Unity Day)


Rashtriya Ekta Diwas (National Unity Day)

జాతీయ ఐక్యతా దినోత్సవం

జాతీయ ఐక్యతా దినోత్సవం ను భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం 24-10-2014 తేదిన ప్రకటించింది. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సంబంధ కార్యాలయాల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని మరియు జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించాలని భారత హోంశాఖ సూచించింది.

దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలోని, కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సూచించింది. ఈ దినోత్సవం నాడు విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది.

జాతీయ సమైఖ్యతా ప్రతిజ్ఞ

దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ - చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్పూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక, నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను.”

National Unity Day-PLEDGE

I solemnly that I dedicate myself to preserve the integrity and security of the nation and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country which was made possible by the vision and actions of Sardar Vellabhbhai Patel. I also solemnly resolve to make my owe contribution no ensure internal security of my country.

Click here to download… Vallabhbhai Patel Biography in Telugu

Previous
Next Post »
0 Komentar

Google Tags