SBI Branch Replacement Services
at Online..!
SBI ఆన్‌లైన్‌లోనే
బ్రాంచ్ మార్చుకునే సేవలు!
*స్టేట్ బ్యాంక్
ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా,
ఏటీఎం, చెక్ బుక్, డీడీ,
నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పలు
సర్వీసులు ఆఫర్ చేస్తోంది.
*అలాగే బ్యాంక్
అకౌంట్‌ను ఒక బ్రాంచు నుంచి మరో బ్రాంచుకు మార్చుకునే సదుపాయాన్ని కూడా
కల్పిస్తోంది.
*అకౌంట్ బదిలీ
చేసుకోవాలంటే గతంలో అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫామ్‌ను ఫిల్ చేయడం, ఎందుకు
ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో తెలియజేడం, ఐడీ ప్రూఫ్ వంటివి
అవసరం అయ్యేవి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభంగానే అకౌంట్ ట్రాన్స్‌ఫర్
చేసుకోవచ్చు.
*ఎస్‌బీఐ అకౌంట్‌ను
ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఎలా మార్చుకోవాలో చూద్దాం
*స్టేట్ బ్యాంక్
అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com/ కు వెళ్లండి.
*పర్సనల్
బ్యాంకింగ్ ఎంచుకోండి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్
అవ్వండి.
*ఇప్పుడు టాప్
మెనూ బార్‌లోని ఇ-సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
*మీకు ట్రాన్స్ఫర్
ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయాలని
భావించే అకౌంట్‌ను ఎంచుకోవాలి. మీకు ఒక అకౌంట్ ఉంటే అదే డిఫాల్ట్‌గా సెలెక్ట్
అవుతుంది.
*ఇప్పుడు మీరు
అకౌంట్‌ను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్ ఎంటర్
చేయాలి.
సబ్‌మిట్ చేయాలి.
*మీ అకౌంట్ ట్రాన్స్ఫర్
వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలి. ఓకే అనుకుంటే కన్ఫర్మ్‌పై క్లిక్ చేయాలి.
*ఇప్పుడు మీ
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.దీన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి.
*మీకు ఒక పాపప్
మెసేజ్ వస్తుంది. ఇందులో మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా
రిజిస్టర్ అయ్యిందని ఉంటుంది.
*బ్యాంక్
సేవింగ్స్ అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండి, రిజిస్టర్డ్
మొబైల్ నెంబర్ ఉంటేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోగలరు.
0 Komentar