Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Scholarships for students with disabilities

Scholarships for students with disabilities


వికలాంగులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు : 2019-20
వికలాంగుల (దివ్యాంగజన్) సాధికారత శాఖ 01 ఏప్రిల్, 2018 నుండి విద్య ద్వారా వారి సాధికారత కోసం వికలాంగుల విద్యార్థులకు స్కాలర్‌ షిప్ లు" అంబ్రెల్లా పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 సంవత్సరానికి ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిన్లు మరియు ఉన్నత శ్రేణి విద్యకోసం స్కాలర్ షిప్ లు వినియోగించుకునేందుకు దివ్యాంగజన్ విద్యార్థులకు డిపార్టుమెంట్ అవకాశం కల్పిస్తోంది. స్కాలర్ షిప్ పథకం యొక్క ఈ మూడు కాంపోనెంట్స్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా అమలు చేయబడుతున్నాయి. NSP లో విద్యార్థుల నమోదు 15 జూలై, 2019 నుండి ప్రారంభమైంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (www.scholarships.gov.in) లో ఆన్ లైన్లో దరఖాస్తు చేయండి. పోర్టల్ పై దరఖాస్తుల దాఖలు మరియు పరిశీలనకు గడువు తేదీలు దిగువ ఇవ్వబడినవి.
40% మరియు ఆపైన వైకల్యం గల మరియు సమర్థ మెడికల్ అథారిటీచే ఈ మేరకు జారీ చేయబడిన తగిన డిజెబిలిటీ సర్టిఫికెట్ కలిగి ఉన్న విద్యార్థులకు పైన తెలిపిన అన్ని స్కాలర్షిప్లు వర్తిస్తాయి. వికలాంగుల హక్కుల చట్టం 2016లో వైకల్యం నిర్వచించబడింది.


(స్కాలర్షిప్ పథకాల గురించి తదుపరి వివరాల కోసం దర్శించండి: www.disabilityaffairs.gov.in)
గమనిక:
(i) దరఖాస్తుల పరిశీలన కోసం ప్రతీ సంస్థ తమ సంస్థ యొక్క నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఫారాన్ని పూర్తిచేయాలి మరియు జిల్లా, రాష్ట్ర నోడల్ అధికారి ద్వారా దాని ఆమోదం పొందాలి. ఒకవేళ సంస్థ/పాఠశాల/కళాశాల ఆ విధంగా చేయకపోతే వారు ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించుకోలేరు.
(ii) వికలాంగులైన విద్యార్థుల కోసం స్కాలర్షిప్ కోసం రాష్ట్ర నోడల్ అధికారుల పేరు, ఇ-మెయిల్ ఐడి మరియు సంప్రదించు వివరాలు వెబ్ సైట్: www.scholarships.gov.in లో లభిస్తాయి మరియు డిపార్ట్మెంట్ వెబ్ సైట్ www.disabilityaffairs.gov.in లో కూడా లభిస్తాయి.
(iii) సంస్థల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) మరియు యూజర్ మాన్యువల్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in మరియు ఈ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ www.disabilityaffairs.gov.in లో కూడా లభిస్తాయి.
click here for detailed information in Telugu
Click here for official scholarships website
Click here for official disability affairs website
Previous
Next Post »
0 Komentar

Google Tags