ఏడాదిలో ఆరు కొలువులు పట్టిందల్లా ఉద్యోగమే....
ఈ పోటీ ప్రపంచంలో
ఉద్యోగం సాధించడమే కష్టం. పరీక్ష రాసిన
ప్రతి ఉద్యోగానికి ఎంపికవుతూ ఇప్పటికి 6 ఉద్యోగాలు సాధించింది నిరుపేద గిరిజన
కుటుంబానికి చెందిన యువతి, ఖమ్మం జిల్లా, కామేపల్లి
మండలం గోవింద్రాల చెందిన బానోత్ గౌతమి.
కుటుంబ నేపథ్యం...
గోవింద్రాలకు
చెందిన లకావత్ ప్రసాద్‌ను గౌతమి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి
ఏడాది వయసున్న కుమార్తె ఉంది. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం
ప్రయత్నిస్తున్నారు. ప్రసాద్ ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.
గౌతమి ఇంటర్ వరకు కారేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, ఇంజినీరింగ్
మధిరలో శ్రీకవిత కళాశాలలో పూర్తి చేశారు. విద్యలో చిన్ననాటి నుంచి ఉత్తమ ప్రతిభ
కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు, అత్తమామలు రెండు కుటుంబాలు
కూడా నిరుపేదల కావడంతో కష్టపడి చదివి ఏదైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో
ఏడాదిపాటు హైదరాబాద్‌లో ఉద్యోగ సాధనకు శిక్షణ తీసుకున్నారు. అనంతరం ల్యాప్‌ట్యాప్
కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో నిరంతరం సిలబస్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను వింటూ
ప్రత్యేక మెటీరియల్‌ను తయారు చేసుకున్నారు. ప్రతి రోజూ ఎనిమిది నుంచి పది గంటలపాటు
నిరంతరం చదువుతూ ఉండేది.
ఆరు కొలువులకు
ఎంపిక
తెలంగాణా రాష్ట్ర
ప్రభుత్వం ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎస్టీ విభాగంలో
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సైతం కైవసం చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో బిల్
కలెక్టర్, గ్రూప్-4, ఆర్‌ఆర్‌బీలో టిక్కెట్
కలెక్టర్, అసిస్టెంట్ లోకో ఫైలెట్, ఫారెస్ట్
బీట్ ఆఫీసర్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి వంటి 6
ఉద్యోగాలకు అర్హత సాధించారు. ప్రస్తుతం కారేపల్లి మండలం మాణికార్యం పంచాయతీ
కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సివిల్ సర్వీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యం
గా నేటితరానికి ఆదర్శంగా నిలుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు బానోత్
గౌతమి గారు.
మూలం: "ఈనాడు"
తెలంగాణ రాష్ట్రం , ఖమ్మం జిల్లా - దినపత్రిక
0 Komentar