Shortage of candidates for Grama sachivalayam jobs
సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థుల కొరత
గ్రామ,వార్డు
సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వివిధ టెక్నికల్ అనుబంధిత రంగాలకు చెందిన 20,959 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది. సచివాలయం మొదటి దశ భర్తీలో భాగంగా
ఆరు విభాగాల్లో మిగిలిన పోస్టుల కంటే..క్వాలిఫైడ్ అయినవారు తక్కువుగా ఉన్నారు.
పశుసంవర్థక శాఖ, పంచాయతీ
సెక్రటరీ(గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వార్డు
ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ, విలేజ్
అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు చెందిన ఆరు విభాగాల్లో మొత్తంగా 39,176 ఖాళీలున్నాయి. వాటికి మొత్తంగా 18,217మంది
అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంకా తొలివిడత భర్తీ అనంతరం 20,959 పోస్టులు మిగిలినట్లు తెలుస్తోంది.
➤పశుసంవర్థక శాఖలో మొత్తం 9,886 ఖాళీలకుగాను 2,163 మంది అర్హత సాధించగా,
7,723 పోస్టులు మిగిలాయి.
➤పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6
డిజిటల్ అసిస్టెంట్‌లో 11,158 ఖాళీలకుగాను 3,623 మంది అర్హత సాధించగా, 7,535 పోస్టులు భర్తీకి
నోచుకోలేదు.
➤వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్
సెక్రటరీలో 3,648 పోస్టులకుగాను 1,474
మంది అర్హత సాధించగా, మరో 2,174
పోస్టులు మిగిలిపోయాయి.
➤విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌లో
4వేల పోస్టులకుగాను 2,622 మంది అర్హత సాధించగా,
1,378 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.
➤వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్
విభాగంలో 3,770 పోస్టులకుగాను 2,096
మంది అర్హత సాధించగా, 1,674 పోస్టులు మిగిలాయి.
➤విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లో
6,714 పోస్టులకుగాను 6,239 మంది అర్హులుకాగా, మరో 475 పోస్టులకు అభ్యర్థుల్లేరు.
ఈ మిగిలిన పోస్టులకు క్వాలిఫైయింగ్
మార్కులు తగ్గించి భర్తీ చేస్తారనే ఆశతో అభ్యర్థులున్నారు. ఆయా కేటగిరీల ఆధారంగా
క్వాలిఫైయింగ్ మార్కులు ఎంత తగ్గుతాయనే అంశంఫై గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు భర్తీ
చేసిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 150 మార్కులకు ఓసీ40, బీసీ35, ఎస్సీ,ఎస్టీలు 30శాతం చొప్పున మార్కులు సాధించిన వారిని
క్వాలిఫైడ్ అభ్యర్థులుగా ప్రకటించారు. ఆయా కేటగిరీల్లో ఎక్కువ మార్కులు సాధించిన
వారి నుంచి ఉద్యోగాల్ని భర్తీ చేశారు. ఇప్పుడు మిగిలిన పోస్టులకు కటాఫ్ మార్కులు
తగ్గించి భర్తీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. దీంతో ఆరు
విభాగాల పోస్టుల్ని ప్రభుత్వమెలా భర్తీ చేస్తుందనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
జనవరిలో మిగులు పోస్టులకు
నోటిఫికేషన్..?
జనవరిలో పలు విభాగాల
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. ఇటీవల సీఎం వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిఏటా జనవరిని రిక్రూట్‌మెంట్ నెలగా ప్రకటించారు. దీంతో
అన్ని విభాగాలకు ఆ నెలలో నోటిఫికేషన్లు వెల్లడించాలి. సచివాలయ ఉద్యోగాల భర్తీలో
ఏపీపీఎస్సీ గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల్లో క్వాలిఫైడ్ అయిన
అభ్యర్థులున్నారు. డీఎస్సీ-2018 ఉపాధ్యాయ పోస్టుల్లో
క్వాలిఫైడ్ అయి, సచివాలయ పోస్టుల్ని కొందరు కైవసం
చేసుకున్నారు. ఈ పోస్టులకు ఇంకా ఫలితాల్ని వెల్లడించలేదు. గ్రూప్-2,3, డీఎస్సీ పోస్టుల్లో వేతనాలు ఎక్కువుగా ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన
అభ్యర్థులను ప్రారంభంలోనే పర్మినెంట్ ఉద్యోగులుగా నిర్ణయిస్తారు. సచివాలయ
ఉద్యోగాలకు ఎంపికైన వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తారు. ఈలోగా ఇతర
పోస్టులకు వెళ్తే, వారంతా సర్వీసులో పొందిన వేతనాల్ని
ప్రభుత్వానికి చెల్లించాలి. గ్రూప్స్, డీఎస్సీ పోస్టులకు
దాదాపు 3వేల మంది అభ్యర్థులు వెళ్లిపోయే అవకాశముంది. దీంతో
సచివాలయానికి చెందిన కేటగిరి-1తోపాటు పలు పోస్టులు ఖాళీ
అవుతాయి. వాటికి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ప్రస్తుతం మిగిలిపోయిన
ఆరు విభాగాల పోస్టులకు కటాఫ్ కుదించి భర్తీ చేస్తేనే ఖాళీలు పూర్తవుతాయి. లేకుంటే
వాటన్నిటికీ తక్కువ ఖాళీలతో మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరముంది.
9908318222
ReplyDelete