Textbooks will change from 1st to 5th classes
1
నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారబోవుచున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల
విద్యలో సంస్కరణలు రానున్నాయి. ఇందులో భాగంగా 1
నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారబోవుచున్నాయి. నూతన విద్యా
విధానం - 2019 ప్రకారం ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో
భాగంగా ' అకడమిక్ సలహా బోర్డు పుస్తకాల మార్పుపై ప్రభుత్వానికి
నివేదిక సమర్పించింది . తరగతుల వారీగా సబ్జెక్టులు వారీగా పాఠ్యాంశాల మార్పుల పై ఈ కమిటీ నివేదించింది. ఇందులో
భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో
సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఒకేసారి 1 - 5 తరగతులు కాకుండా
ఒక సారి 1 , 3 , 5 , ఆ తర్వాత 2 , 4 తరగతుల
పాఠ్య పుస్తకాలను మార్చనున్నట్లు తెలుస్తున్నది . రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే
ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం పై అకడమిక్ సలహా బోర్డు సభ్యులు
భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు . 1 నుంచి 3 తరగతుల వరకు తెలుగు మాధ్యమం కొనసాగించి , 4 . 5 తరగతులకు
వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలని కొందరు సభ్యులు
సూచించారు .
0 Komentar