Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Twinning / Partnership and Teacher Exchange Programme

Twinning / Partnership and Teacher Exchange Programme


ట్విన్నింగ్ , పార్టనర్ షిప్ , టీచర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం
గ్రామీణ , పట్టణ , నగర ప్రాంతాల విద్యార్థులందరూ సమానమైన జ్ఞానాన్ని సముపార్జించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది . ప్రభుత్వ , ఎయిడెడ్ , ప్రైవేటు స్కూళ్ల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా ట్విన్నింగ్ , పార్టనర్ షిప్ , టీచర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను ప్రారంభిస్తోంది . గ్రామీణ , గిరిజన ప్రాంతాలలోని స్కూళ్లు . . పట్టణ , నగర ప్రాంతాల్లోని స్కూళ్ల మధ్య పరస్పర జ్ఞాన మార్పిడి కార్య క్రమాలు చేపట్టనున్నారు . ఇందులో టీచర్లు , విద్యార్థులమార్పిడి కార్యక్రమాలుంటాయి . గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత తరగతుల విద్యార్థులు , టీచర్లను వారం రోజులపాటు పట్టణ ప్రాంతాల స్కూళ్లకు పంపిస్తారు .
ఏయే తరగతుల విద్యార్థులంటే .
విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు తరగతుల వారీగా ఉంటాయి . ప్రాథమిక స్థాయిలో 4 , 5 తరగతుల విద్యా ర్డులను , ప్రాథమికోన్నత స్థాయిలో 6 , 7 , 8 తరగతుల విద్యార్థుల లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సమగ్ర శిక్షా అభి యాన్ ( ఎస్ఎస్ఏ ) ద్వారా చేపడతారు . కేంద్ర మానవవ నరుల అభివృద్ధి శాఖ ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది . జ్ఞాన మార్పిడి కార్యక్రమాలకు అనువైన స్కూళ్లను కూడా ఎంపిక చేయడానికి నిర్ణీత విధివిధానాలను ఎస్ఎస్ఏ ప్రకటించింది . అక్టోబర్ మూడో వారం , నవంబర్ మూడో వారంలో ఈ ' ట్విన్నింగ్ స్కూళ్ల కార్యక్రమాన్ని అమలుచేస్తారు .
స్కూళ్ల కార్యక్రమాలకు ప్రాతిపదికలివీ .
ట్విన్నింగ్ కార్యక్రమానికి సంబంధించి స్కూళ్ల ఎంపికకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. వాటి ప్రాతి పదికగా స్కూళ్ల ఎంపిక చేపడుతున్నారు . 
కరిక్యులమ్ లో క్వాలిటీ ( గుణాత్మక ) , బోధనా విధానాలు , ప్రాజెక్టులు , స్టడీ ( టూర్స్ , ఎక్స్పోజర్ విజిట్స్ ) , సైన్స్ ఫెయిర్స్ , ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ , స్పోర్ట్సు అండ్ గేమ్స్ , కల్చరల్ , లిట రరీ , స్వచ్చంద సేవ , లైఫ్ స్కిల్స్ , స్కూల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , మేనేజ్ మెంట్ కమిటీలు , టీచర్ కౌన్సిల్స్ వంటి అంశాలను బేరీజు వేసుకుని ఆయా స్కూళ్ల మధ్య టీచర్లు , విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు వారం రోజులపాటు ఉంటాయి . కాగా , రాష్ట్ర , జిల్లా , మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి స్కూళ్ల ఎంపిక చేపడుతున్నారు . కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు కూడా ఈ కమిటీలకే అప్పగించారు .
స్కూళ్ల ఎంపిక ఇలా . .
ఈ ట్విన్నింగ్ కార్యక్రమానికి గ్రామీణ , నగర ప్రాంతాల నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు . అంతేకాక మౌలిక , ఆధునిక వసతులు , ఆట స్థలం , క్రీడా పరికరాలున్న స్కూళ్లను ఎంపిక చేయాలి.  బహుముఖ పరిజ్ఞానం , నైపుణ్యం ఉన్న టీచర్లను గుర్తించాలి ప్రయాణ సదుపాయం ఉండాలి .  విద్యార్థుల్లో ఉత్సాహం , ఆరోగ్యం , తెలివిగల వారికి ప్రాధాన్యమివ్వాలి. వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిలేని వారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో సంప్రదించిన తరువాతే పంపాలి . 
సత్సంబంధాలతో ప్రయోజనం
ట్విన్నింగ్ కార్యక్రమాల ద్వారా టీచర్లు , విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతర విద్యార్థులకు , టీచర్లకు పంచడం ద్వారా వారి మధ్య ఇచ్చిపుచ్చుకునే భావన ఏర్పడి స్కూళ్ల పురోగతికి మరింత తోడ్పడుతుంది . 
జ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరికి విస్తృ తపర్చడం ద్వారా నెట్వర్కింగ్ పెరుగుతుంది. టీచర్ల మధ్య శిక్షణాంశాల సమాచారం , సాంకేతికాం శాలు , ప్రాజెక్టులు , ఇతర కార్యక్రమాల అంశాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి .


Previous
Next Post »
0 Komentar

Google Tags