World standards day
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం (14 అక్టోబరు)
ప్రపంచ వినియోగదారులకు ప్రామాణికమైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు చట్టబద్దమైన అధికారాల ద్వారా నిర్ధేశించేందుకు 1946లో లండన్‌లో అక్టోబర్ 14వ తేదీన అంతర్జాతీయ ప్రామాణికరణ సంస్థ ఏర్పాటైంది.
25మంది సభ్యులతో ప్రారంభించిన ఈ సంస్థలో ప్రస్తుతం 125 సభ్యదేశాలు ఉన్నాయి.
1947లో భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ చట్టాన్ని ఆమోదించి బ్యూరోను ఒక శాసన బద్దమైనా సంస్థగా మార్చారు. అప్పటి నుంచే ఐ.ఎస్.ఐ ముద్ర ప్రకటితమైంది. ఈ ముద్ర గల వస్తువులు నాణ్యత కలిగినది.
1947లో భారతీయ ప్రమాణాల సంస్థ మొదటి రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. ఒకటి బట్టలకు, రెండవది ఇంజనీరింగ్‌కు సంబంధించినది. ఈ సంస్థ నిర్ణయించిన తొలి ప్రమాణం ఏమిటోతెలుసా, మన జాతీయ పతాకం ఎంత పొడవు, వెడల్పు ఉండాలన్నది ఈ సంస్థ నిర్ణయించింది.
1951లో ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సంస్థ కార్యాలయంలో స్వీకరించారు.
అంతే కాదు మెట్రిక్ విధానాన్ని దేశంలో 1955లో ప్రవేశపెట్టారు. తర్వాత తూనికలు, కొలతల పరిమాణాన్ని చట్టాన్ని ఆమోదించింది. కాలక్రమంలో టెలి కమ్యూనికేషన్స్ టీకాలు, నూనెగింజలు, త్రాగునీరు, పాడి పరిశ్రమ వంటివి కూడా ఈ సంస్థ పరిధిలోకి చేర్చారు. ఐఎస్‌ఐ మార్కు సంస్థ అనుమతి లేనిదే ఎవరూ వాడకూడదు అన్ని సాంకేతిక పరీక్షలు, తనిఖీలు నిర్వహించిన దరిమిలా ఒక సంవత్సరానికి ఐఎస్‌ఐ లైసెన్స్ ఇస్తుంది. ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి.
ప్రమాణాలు నిర్ణయించడానికి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు ఈ రోజునే ప్రారంభించాయి. కనుక ఈ రోజున వరల్డ్ స్టాండర్స్‌డే గా జరుపుకుంటారు.
0 Komentar