Prakasam SMC audit schedule for FY 2018-19
మండల విధ్యాశాఖాధికారులకు మరియు ఏం.ఐ.ఎస్. కొ ఆర్డినేటర్స్ కు తెలియజేయటమేమనగ రాష్ట్ర పధక సంచాలకులు వారి ఉత్తర్వులు Rc.No. APSSA/F1/50/Audit/2015, Dt.16-04-2019 ప్రకారం మరియు ఎంపిక చేయబడిన చార్టెడ్ అకౌంటెంట్స్ వారు తెలియపరచిన సమాచారం మేరకు తేదీ. 11-11-2019 నుండి పాఠశాల ఆడిట్ కార్యక్రమం నిర్వహించవలసివుంది. కావున మండల విద్యాశాఖాధికారి వారు ఈ క్రింది సూచనల ప్రకారం 2018-19 సం. ఆడిట్ కార్యక్రమానికి పాఠశాలలను ఎంపిక చేయవలెనని సూచించటమైనది.
1. ఏ పాఠశాల అయితే లక్ష రూపాయలు లేక ఆ పైన పొందినా లేదా ఖర్చు చేసిన వారు మరియు CRC/MRC వారు ఖచ్చితంగా ఆడిట్ చేయించుకోవాలి.
2. మండలంలోని మొత్తం పాఠశాలలో 1/3 వంతు ఖచ్చితంగా ఆడిట్ చేయించుకోవాలి
3. పదవి విరమణ చేసిన లేదా చేయబోతున్న పాఠశాలల వారు, సివిల్ వర్క్స్ వున్న వారి యొక్క పాఠశాలలు మరియు
4. ఎక్కువ మొత్తం లో దాతల నుండి విరాళాలు పొందిన పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.
ఈ క్రింది సూచనల ప్రకారం MRC / CRC / SMC అక్కౌంట్స్ సిద్దంగా ఉంచవలసినదిగా తెలియజేయటమైనది.
1. బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాసు పుస్తకం తేదీ. 01-04-2018 నుండి 31-03-2019.
2. నగదు పుస్తకం.
3. గత సంవత్సర ఆడిట్ నివేదికలు
4. సివిల్ వర్క్స్ వాల్యూషన్ సర్టిఫికెట్స్
5. తీర్మానాల పుస్తకం
6. ఖర్చులకు సంబంధించిన బిల్ల్స్ మరియు ఓచర్లు
7. ఖర్చు పెట్టని నగదు తిరిగి కట్టిన రసీదులు మొదలైనవి ఆడిట్ కు సిద్దంగా ఉంచవలసినదిగా తెలియచేయటమైనది.
ఆడిట్ షేడ్యుల్ జత చేయటమైనది. మరియు పై సూచనల ప్రకారం 2018-19 ఆడిట్ కార్యక్రమానికి ఎంపిక చేసిన పాఠశాలల వివరాలు క్రింద జత చేసిన ఫార్మాట్లో నమోదు చేసి తేదీ. 07-11-2019 లోగా జిల్లా కార్యాలయానికి తెలియజేయాలి.
CLICK HERE FOR DETAILS
0 Komentar