CENTA Teaching Professionals‘ Olympiad 2019
(India's Largest Competition for Teachers)
➥Test Date: 14th December
2019 (75 Test Centres, 23 Subjects)
➥Last Date to Register:
25th November 2019
➥Eligibility criteria: At
least 18 years of age and a graduate in any subject or a diploma in education.
➥Relevant for school
teachers, principals, supplemental teachers, volunteers and fellows, B.Ed/D.Ed
students and anyone interested in teaching.
➥No.of awards: 1000 Reliance Foundation Teacher Awards
భారతదేశ వ్యాప్తంగా బోధనలో
నైపుణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా సెంటా కృషిచేస్తోంది. సెంటర్ ఫర్ టీచర్
అక్రిడిటేషన్(సెంటా), టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలంపియాడ్(టీపీఓ)లు
కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులకు వారి నైపుణ్యాలను వెలికి తీసేందుకు
ప్రతీ ఏటా వార్షిక పోటీలను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా డిసెంబర్14,
2019న భారతదేశ వ్యాప్తంగా ఉన్న 75 నగరాల్లో ఈ
పోటీలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 25,
2019 తుది గడువని సెంటా తెలిపింది.
సెంటా టీపీఓకు 12
రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల బోర్డులతో పాటు
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జీ వంటి అన్ని బోర్డులు అండగా నిలుస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా
30,000కు పైగా పాఠశాలల తరఫున ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు.
సెంటా వ్యవస్థాపకురాలు అంజలీ మాట్లాడుతూ... బోధనను ఉత్తమమైన వృత్తిగా ఎంచుకోవడాన్ని
ప్రోత్సహించేందుకు సెంటా టీపీఓ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఉపాధ్యాయులలోని
ప్రతిభను గుర్తించి నగదుతో ప్రోత్సహిస్తాం.
ఈ మేరకు సెంటా ఉత్తమ ఉపాధ్యాయులను
ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించనుంది. అదే విధంగా పోటీలో విజేతలుగా
నిలిచినవారికి రూ. లక్ష నగదుతో పిటు రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డును
అందించనున్నారు. అదేవిధంగా టీపీవో ధృవీకరణ పత్రంతో పాటు, యూకేలోని
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ క్లాస్ హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది.
రిజిస్ట్రేషన్ & అర్హతలు
సెంటా టీపీవో పరీక్షకు దరఖాస్తు
చేసుకోవడానికి www.centa.org/tpo2019 లింక్ ద్వారా లాగిన్ అయి
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పోటీలకు 18 ఏళ్లకు పైబడి,
డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, బీఈడీ/డీఈడీ
విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, సప్లిమెంటల్
టీచర్లు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్లు,
కంటెంట్ క్రియేటర్లు, బోధనాభ్యాసంపై ఆసక్తి
కలిగి ఉన్న ఇతరులు ఎవరైనా పాల్గొనవచ్చని సెంటా తెలిపింది.
పరీక్షా విధానం
సెంటా టీపీఓ పరీక్షలో మల్టీపుల్
చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష నిడివి రెండు గంటలు కాగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోని కామన్ టాపిక్‌లకు
సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా ఆయా అంశాలను అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడంపై
ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
Click here for registrations
Click here for registrations
0 Komentar