ఇంగ్లీష్ మీడియం బోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ గురించి RC. NO.5/EMIC/2019 dt.6.12.19 ద్వారా కమిషనర్ గారి ఉత్తర్వులు సారాంశం.
1. ఉపాధ్యాయుల capacity develope చేయడానికి ఒక module తయారుచేశారు. ఈ module తయారీలో దేశవ్యాప్తంగా పేరుపొందిన విద్యా సంస్థలు EFLU, అన్నా యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, అంబేద్కర్ యూనివర్సిటీ ,ఢిల్లీ వంటి దిగ్గజ సంస్థలు పాలుపంచుకొన్నాయి.
2. ఆంగ్లభాషలో నిష్ణాతులైన 30 మందిని కీ రిసోర్సు పర్సన్స్ KRP లుగా గుర్తించి వారికి ఈ module గురించి శిక్షణ ఇస్తారు.
3.జిల్లాకు 20 మంది చొప్పున 13 జిల్లాల నుండి 260 మందిని స్టేట్ రిసోర్సు గ్రూపు SRG లుగా గుర్తించి వారికి విజయవాడలో పై 30 మంది KRP లు శిక్షణ ఇస్తారు.
4.SRG లుగా విజయవాడ ట్రైనింగ్ లో పాల్గొన్నవారికి ఆంగ్లభాషా ప్రావీణ్యం గురించి జరిగే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో టాప్(ఉన్నత మార్కులతో) లో పాస్ అవ్వాలి.
5. SRG లకు 9.12.19 నుండి 13.12.19 వరకు మరల 19.12.19 నుండి 23.12.19 వరకు 2 బ్యాచ్ లలో ట్రైనింగ్ జరుగుతుంది.
6. DRG ల సెలక్షన్ కొరకు మండలానికి 4 గురు చొప్పున ఎంపిక చేస్తారు. Drg ల ఎంపిక కొరకు 13.12.19 న notification వస్తుంది. వారికి27.12.19 న CBT test జరిపి 31.12.19 నాటికి drg ల ఎంపిక పూర్తి చేస్తారు. ఎంపికైన వారి ప్రొఫైల్ , స్టడీ వివరాలు 5.1.2020 లోపు upload చేయాలి.
7. DRG లకు SRG ల ద్వారా 21.1.2020 నుండి 25.1.2020 వరకు division కేంద్రంలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. Training తర్వాత DRG లకు POST TEST జరుపుతారు.
8. Drg ల ద్వారా ఉపాధ్యాయులకు మండల స్థాయిలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ దాకా వివిధ దశలలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.
0 Komentar