Indian national education day
జాతీయ విద్యా
దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవంను
భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత
ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టినరోజైన
నవంబరు 11 న జరుపుకుంటారు.
స్వతంత్ర భారతదేశంలో
విద్యావ్యవస్థకు పునాదులు వేయడంలో మరియు ఈ రంగంలో దేశం యొక్క ప్రస్తుత పనితీరును
అంచనా వేయడంలో మరియు మెరుగుపరచడంలో ఆజాద్ చేసిన కృషినకి గుర్తు గా మౌలానా అబుల్
కలామ్ ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకునేందుకు మానవ వనరుల
అభివృద్ధి మంత్రిత్వ శాఖ 11 సెప్టెంబర్ 2008 న
నిర్ణయించింది.
ఇలా ప్రతి సంవత్సరం నవంబర్ 11, 2008 నుండి దీనిని సెలవు దినంగా ప్రకటించకుండా జాతీయ విద్యా దినోత్సవంగా
జరుపుకుంటారు. అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత మరియు విద్య యొక్క అన్ని అంశాలపై
పాఠశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
0 Komentar