Notification for Engagement of Act apprentices in
South central railway
NOTIFICATION FOR TRAINING UNDER APPRENTICES ACT, 1961
Notification No.SCR/P-HQ/111/Act. App/2019 Dated
09.11.2019
తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే
అప్రెంటీస్ పోస్టులు భర్తీ వివరాలు
➤ సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య
రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4,103
ఖాళీలను ప్రకటించింది.
➤ మొత్తం 4103
ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ
మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్
చేసి చూడొచ్చు. ఈ పోస్టులకు 2019 నవంబర్ 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటల్లోగా దరఖాస్తు చేయాలి.
➤ మొత్తం 4103
ఖాళీల్లో ఫిట్టర్- 1460, ఎలక్ట్రీషియన్- 871, డీజిల్ మెకానిక్- 640, వెల్డర్-597, ఏసీ మెకానిక్- 249, ఎలక్ట్రానిక్ మెకానిక్- 102,
మెకానిస్ట్- 74, పెయింటర్- 40, ఎంఎండబ్ల్యూ- 34, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18,
కార్పెంటర్- 16, ఎంఎంటీఎం- 12 పోస్టులున్నాయి.
➤ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే
అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి,
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.100.
➤ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, మెడికల్
ఫిట్‌నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఆధారంగా.
➤ అభ్యర్థుల వయస్సు 15
నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు
5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు
వయస్సులో సడలింపు.
➤ ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య
రైల్వే పరిధిలోని 9. లాలాగూడ, మెట్టుగూడ,
కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి,
విజయవాడ, రాజమండ్రి, తిరుపతి,
గుంతకల్, గుత్తి, తిరుపతి,
నాందేడ్, పూర్ణ వంటి ప్రాంతాల్లోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది.
0 Komentar