Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vinadam nerchukundam 18th-22nd programme details

Vinadam nerchukundam 18th-22nd programme details


"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
తేదీ : 22-11-2019
పాఠం పేరు : "గుణాత్మక విద్య - TTP".
సమయం : 11 AM

నిర్వహణ సమయం : 30 ని.లు
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
తేదీ : 21-11-2019
విషయం : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : "వాతావరణం - గాలి"..
తరగతి : 5వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

"వాతావరణం - గాలి".. (21.11.19)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, ప్రసార పూర్వకృత్యాలు ఆట, పాట.
"విందాం - నేర్చుకుందాం"
📻 నేటి రేడియో పాఠం
★ తేది : 20.11.2019
★ విషయము :  గణితం
★ పాఠం పేరు : "ఇది ఎంత బరువు ఉంది"
★ తరగతి : 4వ తరగతి
★ సమయం : 11-00 AM 
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ ఇది ఎంత బరువు ఉంది 
〰〰〰〰〰〰〰〰 
✡ బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
* నిత్య జీవితంలో బరువు తూచే సందర్భాలను వివరిస్తారు
* బరువులను తూచే సాధనాలను చెప్పగలరు
* బరుపుల యొక్క చిన్న, పెద్ద ప్రమాణాలు గ్రాములు, కిలోగ్రాముల పై ఆపగాహస పెంచుకుంటారు.
★★★★★★★★★★★★★
✡ బోధనాభ్యసన సామగ్రి
1) పాఠ్య పుస్తకము   2) నల్లబల్ల  3)సుద్ద ముక్క   4)పాఠశాల మద్యాహ్న భోజనం పాఠ్య పుస్తకం వెనుక ఉన్న వివరాల పట్టిక   5)బరువు తూచే యంత్రము (ఆంగన్ వాడి) చార్టు   6)బరువు యొక్క ప్రమాణాల చార్టు
★★★★★★★★★★★★★
✡ ప్రసార పూర్వ కృత్యాలు:
అ) రేడియో పాఠాన్ని వినడానికి పిల్లలను సిద్ధపరచాలి.
ఆ) కార్యక్రమానికి కావలసిన బోధనోపకరణలను సమకూర్చుకోవాలి.
ఇ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించేవిధానం తెలియాలి.
ఈ) విద్యార్థులను నాలుగు సమాన గ్రూపులుగా చేసి కూర్చోబెట్టాలి.
ఉ) మద్యాహ్నబోజన పట్టికను ప్రదర్శించాలి బరువు తూచే యంత్రమును సిద్ధంగా ఉంచుకోవాలి.
ఊ) బరువు యొక్క ప్రమాణాల చార్డును ప్రదర్శించాలి.
★★★★★★★★★★★★★
✡ ప్రసార సమయంలో
అ) రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థిని లేపి సమాధానాలు చెప్పించాలి.
ఆ) సరియైన సమాధానాలు చెప్పిన వారిని చప్పట్లతో అభినందించాలి.
ఇ) ఒక విద్యార్థి బరువు తూకం వేసి మరొక విద్యార్థిచే పట్టికలో నమోదు చేయించాలి.
★★★★★★★★★★★★★
పాఠ్యాంశ సంబంధిత పాట:
🎼  పాట
కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.

🎤 పల్లవి :
ప్రమాణాలు, ప్రమాణాలు,
బరువుకు ఇవి ప్రమాణాలు
గ్రాములు, మిల్లీగ్రాములు
క్వింటాళ్ళు , కిలోగ్రాములు   //ప్రమా//

🎻 చరణం 1:
ఒక వేయి మిల్లీగ్రాములు అయితే
ఒక గ్రాము అవుతుందీ
ఒక వేయి గ్రాములూ అయితే
ఒక కిలోగ్రాము అవుతుంది
కిలోగ్రాములు ఒక వందయితే
ఒక క్వింటాల్ అవుతుంది    //ప్రమా//

🎻 చరణం 2:
సబ్బులు, టూత్ పేస్టులూ
గ్రాములలో కొలిచేము
ఉప్పు , పప్పు, పంచదారలూ
కిలోగ్రాములలో కొలిచేము
పత్తి, మిరప, వరిధాన్యాలు 
క్వింటాళ్ళలో కొలిచేము   //ప్రమా//
★★★★★★★★
✡ పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.


*"విందాం - నేర్చుకుందాం: నేటి రేడియో పాఠం*
★ తేది : 19.11.2019
★ విషయము :  తెలుగు
★ పాఠం పేరు : "లడ్డూ బాధ"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11-00 AM 
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *లడ్డూ బాధ* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• సంభాషణల ద్వారా గేయ సారాంశాన్ని వివరించడం.
• గేయాన్ని రాగయుక్తంగా పాడించడం, అభినయింపజేయడం.
• పిల్లల్లో హాస్యాన్ని ఆస్వాదించే గుణాన్ని పెంపొందింపజేయడం.
• విన్న అంశంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం.
• సూచించిన పదార్థాల గురించి మాట్లాడించడం.
• సూచించిన వాక్యాలను చదివి తప్పు, ఒప్పులను గుర్తింపచేయడం.
• బెల్లంతో చేసే వంటకాల వివరాలు సేకరింపజేయడం, వాటి గురించి రాయించడం.
• గేయ సారాంశాన్ని స్వంత మాటల్లో రాయించడం.
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి*
1. పాఠ్యపుస్తకం    2. పిల్లల నోట్ బుక్స్    3. పదాలు రాసి ఉంచిన చీటీలు    4. వాక్యాలు రాసి ఉంచిన చీటీలు
★★★★★★★★★★★★★
✡ *ఆట - 1*
• తరగతిలోని పిల్లల పుస్తకాలన్నీ గదిలో ఒక ప్రక్కగా పెట్టించాలి.
• పిల్లలందరినీ వలయాకారంలో నిలబెట్టాలి.
• రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా నిల్చున్నచోటే పిల్లలు పరుగెత్తుతున్నట్లుగా కాళ్ళు కదపాలి.
• 1వ చీటీలో ఇష్టమైన వంటకాలు, 2వ చీటీలో తీయని పండ్లు, 3వ చీటీలో పుల్లని పండ్లు, 4వ చీటీలో కారంతో చేసిన వంటకాలు అని రాసి ఉంచుకోవాలి.
• ఆ చీటీలను మడత పెట్టి విద్యార్ధుల మధ్యలో ఉంచాలి.
• రేడియో టీచరు సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థిచే ఒక్కొక్క చీటీ తీయించాలి.
• ఆ విద్యార్థిచే చీటీలోని విషయం పై రెండు మూడు వాక్యాలు చెప్పించాలి.
*ఆట - 2*
• పిల్లలందరూ వృత్తాకారంలో నిలబడి ఉండాలి.
• రేడియో టీచర్ చెప్పే వాక్యం వినాలి.
• ఆ వాక్యం తప్పయితే పిల్లలు ఉన్నచోట నుండి వెనుకకు దూకాలి.
• రేడియో టీచర్ చెప్పిన వాక్యం ఒప్పయితే పిల్లలు ఉన్నచోటు నుండి ముందుకు దూకాలి.
• సరిగా దూకని వారు ఆటలో ఓడిన వారి క్రింద లెక్క.
★★★★★★★★★★★★★
✡ *ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠాన్ని వినడానికి పిల్లలను సిద్ధపరచాలి.
ఆ) కార్యక్రమానికి కావలసిన బోధనోపకరణలను సమకూర్చుకోవాలి.
ఇ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించేవిధానం తెలియాలి.
✡ *కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణ పై అవగాహన కలిగియుండాలి.*
*కృత్యం-1*
• సంభాషణల ద్వారా విన్న పాఠ్యాంశం పై రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.. పిల్లలు తాము చెప్పిన సమాధానాలను రాజు, లతల సమాధానాలతో సరిపోల్చుకొనేలా చూడాలి.
*కృత్యం - 2*
• పిల్లలు పాఠ్యపుస్తకంలోని 81వ పేజీ తెరవాలి
• దానిలో 'బుగ్గల లోపల ... నుండి ... ఆపజాలవా?' అన్న పదం వరకు పిల్లలచే చదివించాలి.
• రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.
★★★★★★★★★★★★★
✡ *పాఠం పై గేయం :*
• పాఠం పై ఉన్న “లడ్డూ బాధ" సంబంధించిన గేయాన్ని చార్డు పై రాసి అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించండి.
• గేయాన్ని రెండవసారి వచ్చునపుడు  సామూహికంగా చార్టును చూస్తూ పాడించండి.
★★★★★★★★★★★★★
🎼  *పాట*
*కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.*


🎤 *పల్లవి :*
బ్రహ్మ వద్దకు బెల్లం లడ్డూ
ఉరుకులు పరుగులు తీసింది
లోకంలో తనకొచ్చిన బాధలు
ఏకరువు పెట్టింది ఏడుస్తూ   //బ్రహ్మ వద్దకు//


🎻 *చరణం 1:*
తాతయ్యలకు ముసలమ్మలకు
తానే అలుసయ్యానంది
చిన్నవారికీ పెద్దవారికీ
చిదిమే బుద్ధి ఏలంది    //బ్రహ్మ వద్దకు//


🎻 *చరణం 2:*
ఈగలు చీమలు వాలాయంటే
ఇంగిత జ్ఞానం లేదంది
బుద్ది గల్గినా పద్దతి లేని
మనుషుల పనులు తప్పంది   //బ్రహ్మ వద్దకు//


🎻 *చరణం 3:*
బంగరు రంగూ లడ్డూ అంటూ
బ్రహ్మగారు వర్ణించారు
ఎక్కువ సేపు ఇక్కడ ఉంటే
నోట్లో వేస్తా నన్నారు     //బ్రహ్మ వద్దకు//
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags