Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam Nerchukundam 25th-29th november programme details

Vindam Nerchukundam 25th-29th november programme details


'విందాం - నేర్చుకుందాం' లైవ్ స్ట్రీమింగ్ కొరకు క్రింది link ను క్లిక్ చేయండి.
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ :  29-11-2019
విషయం :  మోరల్ స్టోరీ
పాఠం పేరు : ఐకమత్యం
సమయం : 11 AM

నిర్వహణ సమయం : 30 ని.లు
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
తేదీ : 28-11-2019
విషయం : తెలుగు
పాఠం పేరు : "మా ఆటలు"..
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
మా ఆటలు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
సంభాషణలు ద్వారా పాఠ్యాంశాన్ని అవగాహన పరచడం
వివిధ ఆటలను పిల్లలకు పరిచయం చేయడం
గేయాన్ని రాగయుక్తంగా పాడించడం
ఇష్టమైన ఆటగురించి చెప్పించడం, రాయించడం
గేయాన్ని చదివించి ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం
విన్న అంశంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం
ఇచ్చిన పదాలను స్వంత వాక్యాలలో ఉపయోగించడం
సూచించిన పేరాలోని నామవాచక పదాలను గుర్తింపజేయడం
కాగితాలతో బొమ్మలు తయారు చేయించడం.
బోధనాభ్యసన సామాగ్రి :
పాఠ్య పుస్తకం
పిల్లల నోటు పుస్తకాలు
పదాలు రాసిన చీటీలు
సూచించిన వాక్యాల చార్టు
ఆటలు
కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటలను ఆడించే విధానాన్ని తెలుసుకొని ఉండాలి
ఆట-1
పాఠ్యపుస్తకం 76 వ పేజీలో (ఆ)కృత్యంలోని 1.తెచ్చేస్తాం 2.వచ్చేస్తాం 3.చదివేస్తాం 4పాడేస్తాం 5. లేచేస్తాం
అనే పదాలను ఒక్కొక్క చీటీ పై ఒక్కొక్క పదం రాసి మడత పెట్టి ఉంచుకోవాలి.
పిల్లల పుస్తకాల సంచులన్నీ తరగతి గదిలో ఒక ప్రక్కన పెట్టించాలి.
పిల్లలను వృత్తాకారంగా నిల్చో పెట్టాలి.
రేడియో టీచర్ స్టార్ట్ మ్యూజిక్ అనగానే మ్యూజిక్ మొదలవుతుంది.
మ్యూజిక్ వచ్చినంత సేపు పిల్లలు వలయాకారంలో తిరుగుతూ ఉండాలి.
రేడియో టీచర్ స్టాప్ మ్యూజిక్ అనగానే మ్యూజిక్ ఆగిపోతుంది.
మ్యూజిక్ ఆగిపోగానే పిల్లలు తిరగడం ఆపాలి.
ఈ స్థితిలో ఒక విద్యార్థిచే ఒక చీటీ తీయించాలి.
ఆ విద్యార్థి చేత ఆ చీటీలో ఉన్న పదాన్ని ఉపయోగించి ఒక అర్థవంతమైన వాక్యం చెప్పించాలి
మ్యూజిక్ మొదలు కాగానే తిరిగి అదే విధానాన్ని పాటించాలి.
ఆట-2
• 74 వ పేజీలో (ఆ) కృత్యం లో ఉన్న 1. కత్తి పడవలు విహరిస్తాం 2. వాగులు వంకలు చేసేస్తాం 3. వేలిముద్రలతో చేసేస్తాం 4. మట్టితో బొమ్మలు చిత్రాలు అనే వాక్యాలను నల్లబల్లపై రాయాలి.
రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థిచే ఒక్కొక్క వాక్యాన్ని సరిచేసి చెప్పమనాలి.
కృత్యాలు
ప్రసార పూర్వ కృత్యాలు:
రేడియో పాఠ్యాంశం వినడానికి విద్యార్థులను సంసిద్ధులను చేయాలి.
కార్యక్రమ నిర్వహణకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఈ కార్యక్రమంలో నిర్వహించే కృత్యాల పట్ల స్పష్టమైన అవగాహ కలిగి ఉండాలి.
కృత్యం -1 :
* రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు, విద్యార్థులతో సమాధానం చెప్పించాలి
* పిల్లలు తాము చెప్పిన సమాధానాలను 'లత, 'రాజు' లు చెప్పే సమాధానాలతో సరిపోల్చుకోనేలా చూడాలి.
కృత్యం -2 :
* పిల్లలందరూ పాఠ్యపుస్తకం 72 వ పేజీలోని చెట్లు చేమలు ఎక్కేస్తాం' అనే గేయ భాగాన్ని చదివించాలి.
* రేడియో టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి.
* బొంగరాలు భలే తిప్పేస్తాం అనే గేయ భాగాన్ని చదివించాలి.
* పై గేయ భాగంలో ఒత్తు పదాలతో కూడిన ఆటల పేర్లు చెప్పించాలి.
* పై రెండు గేయ భాగాలలో పరికరాలు లేదా వస్తువులు ఉపయోగించకుండా ఆడే ఆటలపేర్లు చెప్పించాలి.
* దాగుడు మూతలు అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి మూడు పదాలు చెప్పించాలి.
పాఠ్యాంశ సంబంధిత పాట:
పాట
కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్డు పై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
 పల్లవి :
ఆటలు ఆటలు ఆటలూ
ఆనందానికి బాటలు
ఆటలు ఆటలు ఆటలూ
ఆరోగ్యానికి కోటలు
పిల్లలకిష్టం ఆటలూ
మా పిల్లలకిష్టం ఆటలూ   //ఆటలు//
చరణం 1:
తొక్కుడు బిళ్ళా దిగుడు పుల్లలూ
తొందరగా ఆడేస్తామండి
గుజ్జన గూళ్ళూ చామన గుంటలు
కూర్చోవి ఆడేస్తామండి    //ఆటలు//
చరణం 2:
కప్పగంతులు కళ్ళకు గంతలు
కలిసే ఆడేస్తామండి
కోతి కొమ్మచ్చి చిర్రగోనెలు
గొప్పగ ఆడేస్తామండి     //ఆటలు//
చరణం 3:
ఒప్పులకుప్ప దాగుడు మూతలు
ఒప్పుగ ఆడేస్తా మండి
బంతీ బ్యాటు పట్టి ఊపుతూ
భలేగ ఆడేస్తామండీ     //ఆటలు//
పాట ప్రసార సమయంలో
మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, ఆట, పాట...

"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
తేదీ : 27-11-2019
విషయం : గణితం
పాఠం పేరు : "ఏ పాత్రలో ఎంత?"..
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, పాట...
Click here for 27th November IRI details
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
తేదీ : 26-11-2019
పాఠం పేరు : "Learn English is Fun"..
తరగతి : 1st & 2nd Class
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 25-11-2019 నేటి రేడియో పాఠం
పాఠం పేరు : "మన పండుగలు"..
విషయం : తెలుగు
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, పాట...
* బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
సంభాషణలు ద్వారా పాఠ్యాంశాన్ని అవగాహన పరచడం పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం
ఇతరుల పండుగలను గౌరవించే సాంప్రదాయాన్ని పిల్లల్లో పెంపొందించడం
విన్న, చదివిన అంశంపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం పాఠ్యసారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు
సూచించిన పండుగ గురించి మాట్లాడించడం, రాయించడం
పదాలు ఆధారంగా పదాలు చెప్పించడం, వాక్యాలు చెప్పించడం
పాట ద్వారా పాఠ్య సారాంశాన్ని పూర్తిగా అవగాహన పొంది, పాటను సొంతంగా పాడగలుగుతారు.
* బోధనాభ్యసన సామాగ్రి :
తెలుగు పాఠ్యపుస్తకం
పిల్లల నోటు పుస్తకాలు, పెన్ను, పెన్సిల్
తెల్లకాగితాలు
ఆరు కాగితపు చీటీలు తీసుకోవాలి. ఒక్కొక్క చీటీ పై కింద సూచించిన పండుగల పేర్లు రాయాలి.
(అ) సంక్రాంతి (ఆ) ఉగాది (ఇ) రంజాన్ (ఈ) క్రిస్మస్ (ఉ)మొహరం (ఊ) దీపావళి
పాటను రాసి ఉంచిన చార్టు.
కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్ని గూర్చి తెలుసుకొని ఉండాలి.
ఆట: పరిగెడుదాం పండుగల పేర్లు చెబుదాం
రేడియో టీచర్ సూచనలు ఆధారంగా ఆటను ఆడించాలి
పిల్లలను వృత్తాకారంగా నిల్చో పెట్టాలి
మ్యూజిక్ వచ్చేంతవరకు పిల్లలను వృత్తం చుట్టూ తిరగమనాలి,మ్యూజిక్ ఆగిపోగానే పిల్లలతో చీటీ తీయించి 'పండుగ' గురించి మాట్లాడించాలి
వాక్యాలలో దాగి ఉన్న పదాలను గుర్తింప చేయాలి.
* ప్రసార పూర్వ కృత్యాలు:
రేడియో పాఠ్యాంశం వినడానికి విద్యార్థులను సంసిద్ధులను చేయాలి.
కార్యక్రమ నిర్వహణకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే/నిర్వహించే కృత్యాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి
రేడియో టీచర్ రేడియో ద్వారా విద్యార్థులను ప్రశ్నలు అడుగుతారు.
రేడియోలో ప్రశ్న అడుగగానే విద్యార్థులు కూడా దానికి సమాధానం చెప్పాలి.
వీటికి సరైన సమాధానాలు, రాజు, లతలు కూడా చెప్తారు
సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించండి.
కృత్యం -1 :
 • రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు, పిల్లలతో సమాధానం చెప్పించాలి. లత, ' రాజు' లు చెప్పే సమాధానాలతో వినేలా చూడాలి.
కృత్యం -2 :
పేరాను చదివించడం -ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం
పాఠ్యపుస్తకంలో 65 వ పేజిలో గల సంభాషణలలో టీచర్ గారి రెండవ సంభాషణను చదివించాలి. (ఇంకొక్క కథేమిటంటే - అక్కడ నుంచి అమావాస్య వరకు).
రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు - సమాధానాలు చెప్పించాలి.
పాఠ్యాంశ సంబంధిత పాట:
*  పాట
కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి. పాఠ్యాంశం ప్రసార సమయంలో నల్లబల్ల దగ్గర ప్రదర్శించాలి.
*పల్లవి :
పండుగలండీ పండుగలు - సరదా సరదా పండుగలు
విశాల భారతదేశంలోన - విశేషమైన పండుగలు  //పండుగలండీ//
* చరణం 1:
ముస్లిం సోదరులందరు కూడి - ముందుగ 'దర్గా' చూసేరు
ఊరు వాడా కలిసొచ్చి - 'ఉర్సు' పండుగ చేసేరు
క్రైస్తవులంతా కలిసేరు -తమిళినాడుకు వచ్చేరు
వేడుకోలుగా వారంతా- వేలంగి వేడుక చేసేరు   //పండుగలండీ//
* చరణం 2:
ఆంధ్రా, బెంగాల్ ప్రజలు -దసరా పండుగ చేస్తారు
బొమ్మల కొలువు పెడుతారు. దుర్గా పూజలు చేస్తారు
తెలంగాణ ముంగిలిలో - గౌరి పూజలు చేస్తారు
మహిళలు చేరి పూలను పేర్చి - బతుకమ్మ పూజలు చేస్తారు   //పండుగలండీ//
* పాట ప్రసార సమయంలో
మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
Click here for 25th November Programme details
Previous
Next Post »
0 Komentar

Google Tags