27th December Cabinet meeting decessions
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు జరిగిన
కేబినెట్ సమావేశం లో చర్చించిన విషయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
వాటిలోని ముఖ్యాంశాలు.
*పంచాయతీ ఎన్నికల
రిజర్వేషన్లు ఖరారు. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.
* మచిలీపట్నం పోర్టును
ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు. రూ.11,900
కోట్లతో ఆరు దశల్లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి.
* 341 శాశ్వత పంట కొనుగోలు
కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. ప్రతీ ఏడాది పసుపు, మిర్చి,
ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర
ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం.
*కొత్తగా 108 వాహనాలు కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 412 వాహనాల కొనుగోలుకు రూ.78 కోట్లు కేటాయించేందుకు
మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* రాజధానిపై జీఎన్ రావు
కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చ.
* CRDA పరిధిలో జరిగిన
అవకతవకల పై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీలో దేనికి అప్పగించాలనే దానిపై ప్రభుత్వం
నిర్ణయం తీసుకోనున్నది.
* రాజధాని పట్టణీకరణపై
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) నివేదిక ఇంకా అందాల్సి ఉందని.. జనవరి మొదటి
వారంలో బీసీజీ నివేదిక అందే అవకాశముంది. జీఎన్ రావు, బీసీజీ
నివేదికపై అధ్యయం చేసేందుకు హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ
కమిటీలో మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు.
* హైపవర్ కమిటీ సూచనల బట్టి
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
0 Komentar