Ammavodi to every one
అందరికీ అమ్మఒడి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్‌ఎయిడెడ్
ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని
పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు
చినవీరభద్రుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని న్యూస్ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో
చదువుతున్న విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు మాత్రమేనని వస్తున్న వార్తలు పూర్తిగా
అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 4న పాఠశాల విద్యాశాఖ విడుదలచేసిన
ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు,
జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే నిరుపేద కుటుంబాలకు చెందిన
విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని వివరించారు.
0 Komentar