Details of RTC
bus fare hike in AP
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు
పెంపు వివరాలు
బస్సు ఛార్జీలు పెంచుతూ ఏపీఎస్‌ఆర్టీసీ మంగళవారం ఆదేశాలు
జారీ చేసింది. కొన్ని సర్వీసులకు కి.మీ.కు 10 పైసలు, మరికొన్నింటికి 20
పైసలు పెంచారు. ప్రైవేటు ట్రావెల్స్ తో పోటీని తట్టుకునేందుకు వీలుగా ఏసీ బస్సుల
విషయంలో కొన్ని సర్వీసులకు అసలు పెంచకపోగా, మరికొన్నింటికి
10 పైసల చొప్పున మాత్రమే పెంచారు. పెంచిన ఛార్జీలతో భారంలో సగం సర్దుబాటు కావచ్చని
అంచనా.
* పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు,
సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కి.మీ.కు 10 పైసల చొప్పున పెంచారు.
పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ
రూ.5గానే ఉంచారు. అల్ట్రా పల్లెవెలుగులో రూ.10కి పెంచారు.
* సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో 2 కి.మీ.కు కనీస ఛార్జీ
రూ.5 ఉండగా, 22 కి.మీ.(11వ స్టేజీ) వరకు ఛార్జీలు పెంచలేదు. ఎక్స్ ప్రెస్,
డీలక్స్, అల్ట్రాడీలక్స్, సూపర్‌లగ్జరీ సర్వీసుల్లో కి.మీ.కు 20 పైసల చొప్పున పెంచారు.
* ఏసీ బస్సుల్లో సూపర్‌లగ్జరీ (ఏసీ), ఇంద్ర,
గరుడ, గరుడ ప్లస్, అమరావతి
సర్వీసుల్లో కి.మీ.కు 10 పైసల చొప్పున పెంచారు. నైట్‌రైడర్, వెన్నెల సర్వీసుల్లో ఛార్జీలు పెంచలేదు.
పెంచిన బస్సు చార్జీల వివరాలు
పాస్‌లపై పెంపు ఇలా..
* నగర పరిధిలో తిరిగేందుకు వీలుండే విద్యార్థి సాధారణ
బస్సు టిక్కెట్ నెలకు రూ.130 ఉండగా, దాన్ని రూ.155కు పెంచారు.
అదే మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో రూ.210 నుంచి రూ.245కు పెంచారు. త్రైమాసిక, వార్షిక పాస్‌ల ధరలు కూడా పెంచారు.
* 4 కి.మీ.వరకు మాత్రమే తీసుకునే విద్యార్థి పాస్‌లకు
నెలకు రూ.45 ఉండగా, దాన్ని రూ.55కు పెంచారు. ఇవి కి.మీ.లు
పెరిగినా కొద్దీ పెరుగుతాయి.
* గ్రామీణ విద్యార్థుల పాస్‌లకు సంబంధించి 5
కి.మీ.దూరానికి నెలకు రూ.85 ఉండగా, దాన్ని రూ.100కు పెంచారు.
ఆ తర్వాత ప్రతి 5-10 కి.మీ. పెరుగుతున్నా కొద్దీ పాస్‌ల ధరలు పెంచారు.
* సాధారణ పాస్‌లు పొందేవారికి ఆర్డినరీ బస్సుల్లో
నెలపాస్ రూ.750 ఉండగా, దాన్ని రూ.870కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో
రూ.850 నుంచి రూ.990కి చేశారు.
* ఎన్జీవోల నెలపాస్‌లు రూ.250 నుంచి రూ.290కి, మెట్రో
ఎక్స్‌ప్రెస్‌ల్లో రూ.350 నుంచి రూ.410కి పెంచారు
0 Komentar