Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC-2018 appointment orders

School Education DSC-2018 Provisionally selected lists communicated, Take necessary action for issue of appointment orders Memo.No.ESE02-20021, Dated: 20-12-2019
DSC-2018 పరీక్షల్లో మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 డీఎస్సీలో ప్రభుత్వ, జెడ్పీ, మోడల్‌ స్కూళ్లతోపాటు వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల పరీక్ష ఫలితాల విడుదల ఆలస్యమైంది. న్యాయ వివాదాలు లేని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని, ఆదివారాల్లో ఆయా అభ్యర్థులను ఆన్‌లైన్‌ ద్వారా ఆప్షన్స్‌ ఇచ్చిన స్కూళ్లలోని పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మెరిట్‌ జాబితా ఆధారంగా పోస్టింగ్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ జాబితాను విద్యా శాఖ కమిషనరేట్‌కు అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసులున్న వాటిని మినహాయించి మొత్తం 2,654 పోస్టులకు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అత్యధిక పోస్టులున్న ఎస్జీటీ కేటగిరీపై కోర్టు నుంచి క్లియరెన్స్‌ రాగానే ఉత్తర్వులు ఇస్తారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags