Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to Link PAN Card with Aadhaar Card?

How to Link PAN Card with Aadhaar Card?


ఆధార్‌ నంబర్‌ను పాన్‌ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పాన్‌ కార్డు- ఆధార్‌ అనుసంధాన గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. తాజాగా మార్చి 31 వరకు పొడిగించింది. జనవరి 27వ తేదీ వరకు పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించిన వారు 30.75 కోట్ల మందికి పైగా ఉంటారు. అయినా, మరో 17.58 కోట్ల మంది ఆధార్‌, పాన్‌ కార్డును అనుసంధానించలేదని ఐటీ శాఖ తెలిపింది. మార్చి 31 లోపు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించిన పాన్‌ కార్డులు మాత్రమే పని చేస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. పాన్‌తో ఆధార్ లింక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి మార్గాలు.
1. మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.
UIDPAN<space><12
 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్>
ఉదాహరణ:
 UIDPAN 111122223333 AAAPA9999Q
(లేదా)
2.
 ముందుగా incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
(లేదా)
3. Income Tax Returns (ITR):
 మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.
మీ పాన్-ఆధార్‌ లింకైందా లేదా ఇలా తెలుసుకోండి ..!

Previous
Next Post »
0 Komentar

Google Tags