Jio
Airtel Vodafone idea raise mobile call and data tariffs
టెలికాం
ఆపరేటర్ల మొబైల్ బాదుడు షురూ
చౌక
మొబైల్ చార్జీలకు కాలం చెల్లింది. ఈనెల 3 నుంచి మొబైల్ కాల్స్,
డేటా చార్జీలను పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్లు వొడాఫోన్-ఐడియా
మరియు ఎయిర్‌టెల్ ప్రకటించాయి. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28,
84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌లపై చార్జీలను పెంచనున్నట్టు
కంపెనీలు వెల్లడించాయి. గత ప్లాన్‌లతో పోలిస్తే తాజా ప్లాన్‌లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు. దీనికి తోడు వొడాఫోన్ ఐడియా
నుంచి ఇతర నెట్‌వర్క్ కు చేసే కాల్స్ పై కూడా నిమిషానికి ఆరు పైసలు వసూలు
చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదే విధంగా డిసెంబర్ 6
నుండి జియో కూడా మొబైల్ కాల్స్, డేటా చార్జీలను
పెంచనున్నట్టు ప్రకటించింది.
వొడాఫోన్
ఐడియా కొత్త ప్లాన్లు..
రోజుకు
1.5 జీబీ డేటా చొప్పున 84 రోజుల కాలపరిమితితో అందించే
రూ.458 ప్లాన్ ధరను తాజాగా రూ.599కి
పెంచారు. ఈ ప్లాన్ ధరను 31 శాతం పెంచారు. రూ.199 ప్లాన్ ధరను రూ.249కి, ఏడాది
పాటు అందించే అన్‌లిమిటెడ్ ప్లాన్ ధర రూ.1699 నుంచి 2,399కి పెంచారు. ఈ ప్లాన్లలో ఎఫ్‌యూపీ లిమిటెడ్ దాటిన తర్వాత చేసే ఇతర నెట్‌వర్క్
కాల్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నారు.
ఎయిర్‌టెల్
కొత్త ప్లాన్లు..
ప్రస్తుతం
ఉన్న రూ.249 ప్లాన్ (28 రోజులు) ధరను రూ.298కి, రూ.448 (82 రోజులు) ప్లాన్
ధరను రూ.598కి పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
నిర్దేశించిన ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత చేసే ఇతర నెట్‌వర్క్ కాల్‌కు
నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
రిలయన్స్
జియో...
ముకేశ్
అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కూడా వినియోగదారులకు
షాకిచ్చింది. వాయిస్, డేటా ఛార్జీలను 40 శాతం మేర
పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్
ప్లాన్లు తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు గానూ
ఎఫ్‌యూపీ లిమిట్ విధించనున్నట్లు వెల్లడించింది.
0 Komentar