School assembly 16th December information
పాఠశాలల, కాలేజీల
అసెంబ్లీ నిర్వహణ కోసం
నేటి ప్రాముఖ్యత
>భారత్ లో విజయ్ దివాస్.
[పాకిస్థాన్ ముష్కరులపై భారత సైన్యం ఘనవిజయం సాధించిన
రోజు. విజయ్ దివాస్ ప్రతి 16 డిసెంబరును ఇండియా లో ఘనంగా జరుపుకుంటాం. ఇది 1971 లో
ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో బంగ్లాదేశ్ ముక్తి బాహినితో కలసి పాకిస్తాన్ పై
సైనిక విజయం సాధించిన రోజు. యుద్ధం ముగిసిన తరవాత పాకిస్తాన్ సైన్యం బేషరతుగా
లొంగిపోవటం మరియు తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడటంగా జరిగింది.
మన వీర సైనికులు నమస్కరిస్తు,అశ్రు నివాళి.]
చరిత్రలో ఈ రోజు
>1951:
సాలార్‌జంగ్ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ
ప్రారంభించాడు.
>1970:
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ.
>1971:
భారత్-పాకిస్తాన్ మూడవ యుద్ధం ముగిసినది.
>1971:
బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
మన సామెతలు/జాతీయములు
కప్పదాటులు వేయుట
వివరణ: ఒక చోట కుదురుగా ఉండక అవకాశమున్న చోటుకు
గెంతేసే వారి గురించి ఈ సామెత వాడతారు. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక
పార్టీలోకి వెళ్ళడాన్ని కప్ప దాటులు వేయడము అని అంటుంటారు. ఒక పద్దతి ప్రకారం
నడవని వాడు
ఆణిముత్యం
నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే
...ఎవరిని ప్రేమించలేవు- మదర్ తెరెసా
మంచి పద్యం
పడగ విప్పిన నాగుకంటే
పరమ భయంకరుడు మనిషీ
పాము కరచిన బతకవచ్చును
మనిషి కాటుకు మరణమే....!
నేటి జీ.కె
ప్రశ్న: ఏ సంవత్సరంలో గాంధీజీ క్రియాశీలక
రాజకీయాల్లోకి వచ్చాడు?
జ: 1919
వార్తలలోని ముఖ్యాంశాలు
> దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన
ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
> ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం
చేయటం, చిరు
పప్పుధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వేర్వేరు బోర్డుల ఏర్పాటు,
మద్యం అక్రమ రవాణా పై కఠిన చర్యలు తో పాటు పలు రంగాలకు చెందిన 11 కీలక బిల్లులను ఏ.పి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో
ప్రవేశపెట్టనుంది.
> తెలంగాణ రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు కష్టకాలం వచ్చింది. 2020–21
విద్యా సంవత్సరంలో వాటికి గుర్తింపు వస్తుందో.. లేదోనన్న.. ఆందోళన మొదలైంది.
> దేశవ్యాప్తంగా టోల్ గేట్ లలో ఫాస్ట్ ట్యాగ్ విధానం ఆదివారం
నుంచి అమలులోకి వచ్చింది.
>కాలుష్యం, భూతాపం వల్ల నదుల్లో
ఆక్సిజన్ తగ్గిపోతుందని కేంద్ర జల
సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం వెల్లడయింది.
>పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు
తీవ్ర రూపం దాల్చాయి, రాజధానితో పాటు పశ్చిమ బెంగాల్ అస్సాం లో
ఆదివారం ఉద్ధృతంగా నిరసన ప్రదర్శనలు,
హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
> ఉత్తర భారతంలో చాలా ప్రాంతాలు శీతల గాలులతో
విలవిల్లాడుతున్నాయి. జమ్ము-కాశ్మీరు, ఉత్తరాఖండ్ లలోని ఎత్తైన
ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 19.6 డిగ్రీల సెల్సియస్కు సెల్సియస్ కు పడిపోయింది.
> వెస్ట్ ఇండీస్ కు భారత్ కు ఆదివారం జరిగిన తొలి
వన్డేలో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
0 Komentar