School
Assembly 21th December Information
చరిత్రలో
ఈ రోజు
➥ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి” 1972
సం.లో జన్మదినం.
➥పీపుల్స్
రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడైన “హు జింటావ్” 1942 సం.లో జన్మించాడు.
➥ప్రముఖ
కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ‘యు.ఆర్.అనంతమూర్తి’ 1932 సం.లో
జన్మించాడు.
➥తెలుగు
సినిమా మరియు రంగస్థల నటుడు,
సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ‘కొచ్చర్లకోట
సత్యనారాయణ’ 1969 సం.లో మరణించారు.
➥రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత “దాసరి కోటిరత్నం” 1972 సం.లో మరణించారు.
మన
సామెతలు/జాతీయములు
కళ్లల్లో
నిప్పులు పోసుకుంటున్నారు
వివరణ:
అతి అసూయ పడుతున్నారని అర్థం. అసూయ గల వారు; ఉదా: వారు వీరి అభివృద్దిని చూసు కళ్లల్లో నిప్పులు
పోసుకుంటున్నారు. అని అంటుంటారు.
తెలుసు కుందాం
మెదడులోని ఏయే ప్రదేశాల్లో భావోద్వేగాలు, ఉద్రేకాలు ఉత్పన్నమవుతాయి?
మెదడు క్రియాశీలతను పరిశీలించి అధ్యయనం చేయడానికి అయస్కాంత అనునాద
చిత్రీకరణ (మాగ్నెటిక్ రెసోనెన్స్ అండ్ ఇమేజింగ్) లాంటి ఆధునిక పద్ధతులు
శాస్త్రవేత్తలకు అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనల ద్వారా మెదడులోని ఏయే ప్రదేశాలు
మానవుల భావోద్రేకాలను నియంత్రిస్తాయో తెలుసుకోగలుగుతున్నారు. భయం, కోపం లాంటి ప్రాథమిక భావోద్వేగాలు
మెదడులోని 'ఎమిగ్డాలా' (Amygdala) అనే
ప్రదేశంలో కలుగుతాయి. అప్రియమైన భావాలు కార్టెక్స్ ముందు భాగంలో మొదలవుతాయి.
పరిశోధకులు ఈమధ్య మానవులకు ఉండే 'ఆరవ జ్ఞానం' (సిక్త్స్ సెన్స్) మూలాలను కూడా కనుగొన్నామని ప్రకటించారు. ఇది మెదడును
కుడి, ఎడమ భాగాలుగా విభజించే గోడల వెంట ఉండే 'ఏంటీరియర్ సింగులేట్ కార్టెక్స్' నుండి కలుగుతుంది.
ప్రేమలాంటి సంక్లిష్ట భావనల విషయంలో మెదడులోని ఎమిగ్డాలా, హార్మోన్లను
నియంత్రించే హైపోథాల్మస్, జ్ఞాపకశక్తి నిక్షిప్తమై ఉండే
హిపోకాంపస్, జ్ఞానేంద్రియాల ప్రభావాలను వడబోసే థాలామస్
లాంటి వివిధ ప్రదేశాల సమైక్య ప్రమేయం ఉంటుంది.
మంచిమాట
"సంతృప్తి గలవాడు మట్టిని ముట్టినా బంగారం
అవుతుంది."
"The secret to discovery is to never believe existing
facts."
మంచి పద్యం
మంచి పద్యం
నీతులెప్పుడు చెప్పకోయీ
బూతులై వినుపించు
దేవా
ఆచరించని జనంకోసం
ఆశపడటం దేనికి
.....!
నేటి జీ.కె
ప్రశ్న: పోలియో వంటి వ్యాధులలో, వైరస్‌చే
నశింపబడే కణాలు ఏవి?
జ: చాలకనాడీ కణాలు
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥ఏ.పి. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ
కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి కి సమర్పించారు.
➥పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా,
రాయలసీమ రీజియన్లు విభజించి అభివృద్ధి చేయాలని జీఎన్ రావు కమిటీ తమ నివేదిక లో సూచించింది.
➥సౌర విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ దేశంలోనే రెండో
స్థానంలో ఉండటం అభినందనీయమని, నిరంతర విద్యుత్ సరఫరా మరిన్ని పరిశ్రమలను
ఆకర్షిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.
➥ దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై ఏమౌతుందోనని
యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని, నిందితుల రీపోస్టుమార్టంకు ప్రభుత్వం కూడా
ముందుకొచ్చి పారదర్శకతను చాటుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
➥ఏ.పి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును వచ్చే జనవరి 9 లేదా
10 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ,
జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల
ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
➥ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర్ ప్రదేశ్‌లో
జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారని రాష్ట్ర పోలీసులు శుక్రవారం నిర్ధారించారు.
➥ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార
కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జీవితఖైదు
శిక్షను విధించింది.
➥ అఫ్గానిస్తాన్‌లోని హిందూ కుష్
పర్వత ప్రాంతంలో శక్రవారం సాయంత్రం రిక్టరు స్కేలుపై 6.3
తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు
ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
0 Komentar