Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School assembly 30th december information

School assembly 30th december information


చరిత్రలో ఈరోజు
*ఢాకా లో ముస్లిం లీగ్ పార్టీని 1906సం. లో స్థాపించారు.
*ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను 2006 సం. లో ఉరితీశారు.
*భారతదేశ ప్రముఖ ఋషియైన రమణ మహర్షి 1879సం. లో జన్మించారు.
*భారతదేశపు ప్రముఖ చదరంగం ఆటగాడు మాన్యువెల్ ఆరన్ 1935 సం.లో జన్మించారు.
*హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు సబీర్ భాటియా 1968 సం.లో జన్మించారు.
*ప్రముఖ శాస్త్రవేత్త విక్రం సారాభాయ్‌ 1971సం. లో మరణించారు.
*ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య 1973సం. లో మరణించారు.
నేటి అంశం - నిద్ర లేమి అనర్ధాలు
తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం,  నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని వైద్యులు వివరిస్తున్నారు.
మంచి మాట
"ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ సమయాన్ని వృథా చేసుకోకు.అది నీకేవిధంగాను ఉపయోగిపడదు"
మంచి పద్యం
కంటి రెప్పవోలె కాపు గాయుచునుండి
వెలుగు దారి జూపు వెన్ను తట్టి
మారదమ్మ  ప్రేమ మరుజన్మకైననూ
కరుణజూపుతల్లి కల్పవల్లి
నేటి జీ.కె.
2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధిక జనాభా ఉన్న నగరం?
జవాబు: ముంబై

వార్తలలోని ముఖ్యాంశాలు
*మాస్కోలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో  మహిళల ర్యాపిడ్‌ విభాగంలో  కోనేరు హంపి విశ్వవిజేతగా అవతరించింది.ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది.
*వ్యవసాయ విద్యుత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సౌర విద్యుదుత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఉందని  ఈ దిశగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు.
*రెండు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన  విశాఖ ఉత్సవ్‌ ముగిసింది. ఇక్కడ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి ఆనంద పరవశులయ్యారు.
*తెలంగాణ కళాభారతి వేదికగా జరుగుచున్న హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ఫెయిర్‌ వేలకొలది పుస్తకాలతో వీక్షకులను కనువిందు చేస్తున్నది.
* తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటిగా ఇంగ్లిషు మీడియం వైపు మళ్లుతున్నాయి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ తీర్మానం చేసి పంపితే చాలు మీడియం మార్పునకు డీఈవోల స్థాయిలోనే ఆమోదం తెలపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*జార్ఖండ్ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.
* ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆయనకు పురస్కారాన్ని అందజేశారు.
* ప్రఖ్యాత ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags