Solar Eclipse
సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏమిటి..?, గ్రహణం రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు...
ఈ రోజు వచ్చే సూర్యగ్రహణం ఏడాదిలో మూడో సూర్యగ్రహణం, అలాగే
సంవత్సరంలో చివరి వార్షిక సూర్యగ్రహణం. దీనినే 'రింగ్ ఆఫ్
పైర్' అని కూడా అంటారు.
గ్రహణం అంటే..?
సూర్యుడు, భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు
అడ్డుకున్న సమయంలో సూర్యగ్రహణం వస్తోంది. సూర్యుడిని కప్పి ఉండటం వల్ల గ్రహణం
ఏర్పడుతుంది. ఆయా సందర్భాన్నీ బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణంగా సూర్య, లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఉదయమే..
స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7.59 గంటలకు
సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది. ఉదయం 9.04 గంటలకు గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది. ఉదయం 10.47 గంటలకు గ్రహణం ముగుస్తోంది. సూర్యగ్రహణం గరిష్టంగా 3 నిమిషాల 40 సెకన్ల పాటు ఉండనుంది.
ఏం చేయకూడదంటే..
సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదనే
అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవద్దని, నీరు కూడా తాగొద్దని పెద్దలు చెప్తుంటారు. గ్రహణానికి ముందునుంచే ఇంట్లో
వంట చేయకూడదని అంటారు. ఇంట్లో ఉన్న వృద్ధులకు ఆహారానికి బదులు ఎలక్ట్రోలైట్లు
ఇవ్వాలని సూచిస్తారు. సూర్యరశ్మి కనిపించని సమయంలో బ్యాక్టీరియా చురుగ్గా
పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దని
సూచిస్తున్నారు.
నేరుగా చూడొద్దు..
సూర్యగ్రహణం సమయంలో అతినీతలోహిత కిరణాలు చురుగ్గా ఉండటంతో
ఆహారం తీసుకోవద్దని చెప్పే మాటలను చాలా మంది విశ్వసిస్తారు. అంతేకాదు గ్రహణం
సమయంలో ఆకాశం వైపు నేరుగా చూడొద్దని సలహా ఇస్తున్నారు. నేరుగా కిరణాలను చూడటంతో
వారి కంటి దృష్టిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు.
0 Komentar