The recruitment process in Indian Railways will be change
భారతీయ రైల్వేలో నియామక ప్రక్రియ మారబోతోంది
భారతీయ రైల్వేలో నియామక ప్రక్రియ మారబోతోంది. భారతీయ
రైల్వేలో ప్రస్తుతం ఉన్న 8 గ్రూప్ ఏ సర్వీసుల్ని కలిపి ఒకే సెంట్రల్ సర్వీస్
ఏర్పాటు చేయబోతున్నారు. అదే ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్(IRMS). ఐఆర్ఎంఎస్ నియామకాలు కూడా యూపీఎస్సీ పరిధిలోకే రాబోవు చున్నాయి.
యూపీఎస్‌సీ నిర్వహించబోయే ఐఆర్ఎంఎస్ కోసం అభ్యర్థులు మొదట
ప్రిలిమ్స్ రాసి, ఆ తర్వాత ఐఆర్ఎంఎస్‌లో ఐదు స్పెషాలిటీస్‌లో ఒకటి
ఎంచుకోవాలి. అందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, టెక్నికల్ స్పెషాలిటీస్ ఇంజనీరింగ్
పరిధిలోకి వస్తాయి. నాన్ టెక్నికల్ పేరుతో మరో స్పెషాలిటీ ఉంటుంది. ఈ పోస్టు
ద్వారా అకౌంట్స్, పర్సనల్, ట్రాఫిక్
విభాగాల అధికారులను నియమిస్తారు. ఇకపై రైల్వేలో కొత్త నియామకాలన్నీ యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారానే జరుగుతాయని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్
తెలిపారు.
0 Komentar